Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా

Wed, 16 Dec 2020-1:25 pm,

Non-Chinese smartphones launched in India in 2020: భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో కొత్త ధోరణిని ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తులకు బదులుగా ఇతర స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు పెరిగింది. జాతీయభావానికి కట్టుబడి ఉండటంతో జూన్ తర్వాత భారత మార్కెట్‌లో చైనా మొబైల్స్ పూర్తిగా తగ్గిపతోయింది. 2020లో తమ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేసిన 5 చైనాయేతర (Non Chinese) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల వివరాలపై ఓ లుక్కేయండి.

దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాది పలు గెలాక్సీ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఫోల్డబుల్ మొబైల్‌ను సైతం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2020లో శాంసంగ్ కంపెనీ భారత్‌లో లాంచ్ చేసిన మోడల్స్ Galaxy A12, Galaxy A02S, Galaxy A021s, Samsung Galaxy S20 Fan Edition, Galaxy M51, Samsung Galaxy Z Fold 2, Samsung Galaxy M31s.

నోకియా కంపెనీ 2020లో హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీతో కలిసి పలు రకాల మొబైల్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నోకియా 2.4 (Nokia 2.4), నోకియా 5310 (Nokia 5310), నోకియా 6.2 (Nokia 6.2) మోడల్స్ ఈ ఏడాది నోకియా నుంచి విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అని చెప్పవచ్చు. 

Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే

ఈ ఏడాది నవంబర్ నెలలో రెండు లేటెస్ట్ మోడల్స్‌ను సైతం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది మైక్రోమ్యాక్స్. తాజాగా తీసుకొచ్చిన ఇన్ సిరీస్‌లో IN 1B, మరియు  IN Note 1 మోడల్స్ ఉన్నాయి. IN 1B 2+32 జీబీ వేరియంట్ కాగా, ధర రూ.6,999. 4+64 జీబీ వేరియంట్ కాగా, ధర రూ.10,999 4+128 జీబీ వేరియంట్ కాగా, ధర రూ.12,499  

భారత్‌లో తయారైన LAVA మొబైల్స్ ఈ ఏడాది భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. బడ్జెట్ ధరలకే స్మార్ట్‌ఫోన్లను లావా రిలీజ్ చేసింది. లావా ఫ్లిప్ (LAVA Flip), లావా పల్స్ (LAVA Pulse), లావా జెడ్ 66 (LAVA Z66), లావా జెడ్ 61 (LAVA Z61), లావా జెడ్ 61 ప్రో (LAVA Z61 Pro) స్మార్ట్‌ఫోన్లను దేశీయ హ్యాండ్‌సెట్ తయారీదారు LAVA Mobiles ఈ ఏడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్స్ యాపిల్ ఫోన్లు. ఈ ఏడాది ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం యాపిల్ నుంచి ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 12 మిని (iPhone 12 Mini), ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ (iPhone 12 Pro Max) స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. ఎప్పటిలాగే హాట్ కేకుల్లా ఐఫోన్ 12 వేరియంట్లు విక్రయాలు జరిగాయి.

Also Read: Worlds Shortest Woman Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link