Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
చాలా మంది పాములంటే చచ్చేంత భయంతో వణికిపోతుంటారు. కానీ కొన్నిసందర్భాలలో పాములు మన ఇళ్లలోనికి వస్తుంటాయి. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి.ఎలుకల కోసం మన ఇళ్లలోకి కన్పిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో పాములు మనుషులను కాటు వేస్తుంటాయి.
ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయంకు వెళ్లే రైతులు పాముల కాటుతో తెగ ఇబ్బందులు పడుతుంటారు. చెట్లకు నీళ్లను పట్టే క్రమంలో, పొలాలను దున్నేటప్పుడు పాములు కన్పిస్తాయి. ఇవి కొన్నిసార్లు కాటు వేస్తుంటాయి. కొందరు పాములు కన్పిస్తే, వాటికి ఆపద కల్గించరు. వెంటనే స్నేక్ హెల్పింగ్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు.
కొన్నిసార్లు పాములు పగబడుతాయని అంటారు. ఇప్పటికే చాలా మందిని పాములు కాటు వేసిన కూడా ప్రాణాలతో బయటపడిన ఘటనలు కొకొల్లలు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికంగా మాల్వాపరిధిలోని సౌరా అనే గ్రామంలో.. వికాస్ దూబే (24) అనే వ్యక్తిని, పాము నెలన్నర వ్యవధిలో.. ఐదుసార్లు కాటు వేసింది. గత నెల..జూన్ 2 న తొలిసారి రాత్రి 9 గంటలకు, మరల జూన్ 10న కాటేసింది. ఆ తర్వాత..వారం తర్వాత జూన్ 17 న,నాలుగోసారి, అత్తగారింట్లో ఉండగా కూడా కాటు వేసింది. గత శుక్రవారం రాత్రి..12 కు కూడా వికాస్ పాము కాటుకు గురయ్యాడు.
అతగాడి లక్ ఏంటంటే.. పాముకుట్టిన ప్రతిసారి కూడా.. అతను కరెక్ట్ టైమ్ కు వైద్యుల దగ్గరకు వెళ్లడంతో అతను ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ క్రమంలో సదరు గ్రామస్థులు, కుటుంబ సభ్యులుమాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము పగబట్టిందా.. అంటూ టెన్షన్ కు గురౌతున్నారు.
మరికొందరు మాత్రం.. ఇతను పాముకు ఏదైన ఆపద కల్గించాడో ఏమో.. లేకుండా పాము పదే పదే ఇతడిని మాత్రమే ఎందుకు కాటు వేస్తుందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.