Card Transactions: కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచిన RBI
ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చాక చాలా వరకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. నగదు చెల్లింపులకు గత కొన్నేళ్లుగా విరివిగా వాడుతున్న సౌకర్యం కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్. మీ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, యూపీఐ (UPI) ద్వారాగానీ కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) పెంచింది. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేసేవారికి శుభవార్త అందించింది.
ఇప్పటివరకూ ఉన్న రూ.2000 పరిమితిని రూ.5000కు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన డిసెంబర్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. జనవరి 1, 2021 నుంచి పెంచిన ట్రాన్సాక్షన్ పరిమితి అందుబాటులోకి రానుంది. కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా నగదు చెల్లింపులు చేసే వినియోగదారులకు ఇది లాభదాయకం.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం మంచి నిర్ణయమని సూచించారు. 2020లో ఇదే చివరి మానిటరీ పాలసీ సమావేశం. మరోవైపు కీలకమైన వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.
రెపో రేటు 4 శాతంగా ఉండనుంది. అదే సమయంలో రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగుతోంది. గత మూడు మానిటరీ పాలసీ సమావేశాలలో ఈ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నారు. మార్జినల్ స్టాంగింగ్ ఫెసిలిటీ (MSF) 4.25శాతంగా ఉంది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
సెప్టెంబర్ నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం 7.3 శాతానికి, 2020 అక్టోబర్‌లో 7.6 శాతానికి పెరిగింది. సీపీఐ ద్రవ్యోల్బణం 2020-21 మూడో త్రైమాసికానికి 6.8 శాతం, 2020-21 నాలుగో త్రైమాసికానికి 5.8 శాతం, హెచ్1ను 2021-22లో 5.2 నుంచి 4.6 వరకు ఆర్‌బీఐ గవర్నర్ అంచనా వేశారు.
Also Read : Bigg Boss Telugu 4: ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్.. డేంజర్ జోన్‌లో అతడే!