Bigg Boss Telugu 4: ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్.. డేంజర్ జోన్‌లో అతడే!

Hotstar)
  • Dec 06, 2020, 08:53 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu Season 4)లో గ్రాండ్ ఫినాలే టికెట్ పొందిన తొలి కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్ నిలిచాడు. ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో అఖిల్ ఒకడు కాగా, ఈ నామినేషన్ నుంచి సేవ్ అయితేనే అతడికి మొన్న గెలుచుకున్న రేస్ టు ఫినాలే అందించనున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శనివారం రాత్రి ఎపిసోడ్‌లో ఒక్క కంటెస్టెంట్‌ను సేవ్ చేయగా.. బిగ్‌బాస్ తెలుగు 4 ఎలిమినేషన్ నుంచి ఈ వారం సేవ్ అయిన తొలి కంటెస్టెంట్ అఖిల్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్ టైటిల్ రేసులో నిలిచాడు. (Photo: Hotstar)

1 /5

2 /5

దాదాపు ఒకరోజు పాటు ఊయల కిందకి దిగకుండా సోహైల్‌తో పోటీపడి మరీ కూర్చుని రేస్ టు ఫినాలే టికెట్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎలిమినేషన్ నుంచి సేవ్ కాగా, అఖిల్‌కు ఫినాలే మెడల్ అందజేయాలి. ఎవరికి అవకాశం ఇస్తావని అడగగా తనకోసం త్యాగం చేసిన సోహైల్ పేరును అఖిల్ సూచించాడు. బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జున చెప్పగా.. ఫినాలే మెడల్‌ను అఖిల్ మెడలో వేశాడు సోహైల్. (Photo: Hotstar)

3 /5

బాండింగ్ స్టిక్స్ బ్రేక్ చేసే టాస్క్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. తొలుత అరియానా తనకు ఇద్దరితో బాండింగ్ ఉందని ఫస్ట్ అవినాష్ అని, రెండో వ్యక్తి సోహైల్ అని చెప్పింది. అయితే రేస్‌లో ముందుకు వెళ్లడానికి అడ్డుపడే బాండింగ్ సోహైల్ అని చెప్పి బాండింగ్ స్టిక్‌కు విరిచేసింది. హోస్ట్ నాగార్జున చెప్పడంతో ఆ కర్ర ముక్కను సోహైల్ చేతిలో పెట్టింది అరియానా. (Photo: Hotstar)

4 /5

బిగ్‌బాస్ 4 ఫైనల్స్ చేరిన అఖిల్ బాండింగ్ స్టిక్ బ్రేక్ చేసి మొనాల్ గజ్జర్‌తో తన బంధాన్ని సైతం బ్రేక్ చేశాడు. తాను మైండ్‌తో ఆలోచిస్తానని మొనాల్ చెప్పిందని, ఇప్పుడు తాను కూడా మెదడుతో ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నాడు అఖిల్. సోహైల్ సైతం బాండింగ్‌లో ఉన్నాడని, కానీ దీని వల్ల తనకు ఇబ్బంది లేదని, ఆటకు ఇబ్బంది అయ్యే బాండింగ్ మాత్రం మొనాల్‌తో తనకు ఉందని బాండింగ్ స్టిక్ విరిచేశాడు అఖిల్. (Photo: Hotstar) Also Read: Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

5 /5

బిగ్‌బాస్ సీజన్ 4లో ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్ కాగా, ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారన్న దానిపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ వారం అవినాష్, అభిజిత్, హారిక, మొనాల్ గజ్జర్ ఇంకా నామినేషన్స్‌లో ఉన్నారు. నేటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ ఎవరు అవుతారన్నది తేలనుంది. అప్పటివరకూ బిగ్ బాస్ 4 ప్రేక్షకులు ఎదురుచూడక తప్పదు. అయితే అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. గత వారమే అవినాష్ ఎలిమినేట్ కావడం, ఎవిక్షన్ కార్డ్ ద్వారా సేవ్ కావడం తెలిసిందే. (Photo: Twitter)  Also Read : Silk Smitha: టాలీవుడ్ నటి సిల్క్ స్మిత.. ఆసక్తికర విషయాలు