Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం

Fri, 12 Feb 2021-11:21 am,

పన్నులు మరియు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులకు తరచుగా ఎదరయ్యే ప్రశ్న కోటీశ్వరులు కావడం ఎలా?. దీనికి వారు ఇచ్చే సలహా ఏంటంటే పెట్టుబడి విధానాన్ని మార్చడం. పెట్టుబడిదారులందరికీ, పన్ను మరియు పెట్టుబడి నిపుణులు కేవలం 4 విషయాలు మీకు సూచిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి (10-15 లేక 30 సంవత్సరాలు) ద్వారా అధిక లాభాలు, ఆదాయం పొందవచ్చు. 

Also Read: SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు

30 ఏళ్ల కాలవ్యవధిలో రూ.7,56,000 పెట్టుబడి ద్వారా వడ్డీతో కలిపితే మొత్తం ఒక కోటి రూపాయల 16 లక్షల 69 వేల 817 రూపాయలు మీరు సొంతం చేసుకోవచ్చు. అది తెలుసుకునేందుకు ఈ వివరాలు తెలుసుకోండి.

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వేగంగా పెరుగుతూ ప్రయోజనాలు అందిస్తాయి. వాస్తవానికి, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అంటే 10-15 సంవత్సరాలు కాల పరిమితితో ఎంచుకుంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్ కనిష్టంగా 12 శాతం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆలోచన అని సెబీ రిజిస్టర్డ్ టాక్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి సలహా ఇస్తున్నారు.

Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తీక్ ఝవేరి ఈ విషయం చెప్పారు. ‘మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. అయితే, దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి విషయంలో మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఏ పరిస్థితుల్లో అయినా రెండంకెల వృద్ధి అనేది దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ నుంచి పొందచ్చునని’ చెప్పారు.

Also Read: APY Scheme: 18 ఏళ్లు నిండాయా, ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెలా చేతికి డబ్బులు

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కెరీర్ ప్రారంభ దశలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ (Systematic Investment Plan)ను ప్రారంభించాలని ఝవేరి సలహా ఇచ్చారు.  "ఒకేసారి పెట్టుబడికి మీ వద్ద ఎక్కువ నగదు లేకపోవడంతో యువత రికరింగ్ మోడ్ ద్వారా ఇన్వె్స్ట్‌మెంట్ సాధ్యపడుతుంది. పెట్టుబడి విషయంలో SIP మీ సమస్యను పరిష్కరిస్తుంది. కెరీర్ ప్రారంభ దశలో SIP చేయడం ప్రారంభించి 30 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం ద్వారా మన పెట్టుబడిపై 14 నుండి 16 శాతం వడ్డీ మొత్తం అధికంగా అందుకుంటారు. (ZeeBiz Photo)

మ్యూచువల్ ఫండ్స్ SIPపై కార్తీక్ జావేరి మరియు జితేంద్ర సోలంకి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఒక పెట్టుబడిదారుడు దీర్ఘకాలికంగా 30 సంవత్సరాలు 2,100 రూపాయలు పెట్టుబడి పెడితే, దానిపై 14 శాతం రిటర్న్స్ ఆశించవచ్చునని చెప్పారు. కనీసం 14 శాతం రాబడిని ఆశిస్తూ 30 ఏళ్లపాటు నెలవారీ SIP ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏకంగా రూ.1,16,69,817 మెచ్యూరిటీ లభిస్తుంది.

Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link