Yuvraj Singh Biopic: వెండితెరపై సిక్సర్ల వీరుడి ఆత్మకథ.. యువరాజ్ సింగ్ సినిమా ప్రకటన

Yuvraj Singh Biopic: భారతీయ సినిమాల్లో ఎంతో మంది క్రీడాకారుల ఆత్మకథలు సినిమాలుగా తెరకెక్కాయి. ఇప్పుడు సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ఆత్మకథ సినిమాగా రాబోతున్నది.

Yuvraj Singh Biopic: భారత క్రికెట్ చరిత్రలో మరపురాని ఆటగాడు యువరాజ్ సింగ్. క్రికెట్ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఒక్క యువరాజ్ సింగ్‌దే.

Yuvraj Singh Biopic: క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆదర్శప్రాయం. ఎన్నో కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా యువరాజ్ రాణించాడు.
Yuvraj Singh Biopic: 2011లో వన్డే ప్రపంచకప్ భారత్‌కు రావడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 2019లో క్రికెట్‌కు యువరాజ్ వీడ్కోలు పలికాడు.
Yuvraj Singh Biopic: అంతేకాదు యువరాజ్ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్‌కు చికిత్స చేసుకుని పునర్జన్మ పొందాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక 2012లో మళ్లీ బ్యాట్, బంతి పట్టాడు.
Yuvraj Singh Biopic: అందరికీ స్ఫూర్తిదాయకమైన యువరాజ్ సింగ్ ఆత్మకథను దృశ్యరూపకంగా టీ సిరీస్ ఫిల్మ్స్ తీయనుంది. ఈ మేరకు నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ అధికారిక ప్రకటన చేశారు. వీరిద్దరూ గతంలో యానిమల్, కబీర్ సింగ్ సినిమాలతోపాటు సచిన్ టెండూల్కర్ డాక్యుమెంటరీ తీశారు. ఇప్పుడు యువరాజ్ జీవితచరిత్రను తీస్తుండడంతో క్రికెట్ అభిమానులతోపాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Yuvraj Singh Biopic: యువరాజ్ ఆత్మకథ 'సిక్స్ సిక్సెస్' అని టైటిల్ పెట్టారు. త్వరలోనే దర్శకులు, నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి.
Yuvraj Singh Biopic: సినిమాను వేగంగా తెరకెక్కించి వచ్చే ఏడాది విడుదల చేయాలని టీ సిరీస్ బృందం భావిస్తోంది.