6 Zodiac Signs Biggest Liars: ఈ 6 రాశులవారితో జాగ్రత్త..వీరు అబద్ధాలు చెప్పడంలో దిట్ట..!
తుల రాశి: తులారాశి వారు సమతుల్యతను ఇష్టపడతారు. వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల రాశివారు అబద్ధాలు చెప్పడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. మరి కొంతమంది ప్రయోజనం కోసం ఇతరులను మోసం చేయడానికి అబద్ధాలు చెబుతుంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు సాధారణంగా నిజాయితీగా ఉంటారు. వృశ్చిక రాశివారు ఎలాంటి రహస్యాలను అయిన ఇతరలకు తెలియకుండా ఉంచుతారు. వీరు మంచి స్నేహితులగా ఉంటారు. అయితే ఏదైనా తప్పు చేసి ఉంటే దాని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెబుతుంటారు. కొన్నిసార్లు నిజం చెప్పి ఇతరలను బాధపట్టడం నచ్చక అబద్ధాలు చెబుతుంటారు. తమ భావాలను బయట పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి, నిజమైన భావాలను దాచడానికి అబద్ధాలు చెబుతారు.
మీన రాశి : మీన రాశి వారు సాధారణంగా సున్నితమైన వ్యక్తలుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇతరుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ వాస్తవాన్నికి ఈ రాశివారు అబద్ధాలను చెబుతుంటారు. కారణం ఇతరులను బాధపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో భయంతో అబద్ధాలు చెప్పవచ్చు. ఉదాహరణకు, తప్పు చేసినప్పుడు శిక్ష పడటం భయంతో అబద్ధం చెబుతుంటారు.
మిథున రాశి : ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో తెలివైవారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే ఇతరులను సంతోషపెట్టడానికి అబద్ధాలు చెబుతుంటారు. కొన్నిసార్లు, వారు కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి కూడా అబద్ధాలు చెబుతుంటారు. ఇతరులను బాధపెట్టకుండా ఉండటానికి అబద్ధాలు ఆడుతుంటారు,
కర్కాటక రాశి: కర్కాటక రాశివారు భావోద్వేగపరులు. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడుతుంటారు. తప్పు చేసినందుకు లేదా శిక్షించబడటానికి భయపడి అబద్ధాలు చెబుతుంటారు. ప్రియమైనవారిని రక్షించుకోవడం కోసం వీరు అబద్ధాలు చెబుతుంటారు. కొంతమందికి అబద్ధాలు చెప్పడం ఒక అలవాటైపోతుంది.
కుంభ రాశి: నీరుదాత రాశిని పిలుస్తారు. ఈ రాశివారు స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలను, విషయాలను అన్వేషించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతారు.కుంభ రాశి వారు ఇతరులను బాధపెట్టకుండా ఉండటానికి అబద్ధం చెబుతారు, కొన్ని సందర్భాల్లో సామాజికంగా అంగీకరించబడాలనే కోరికతో అబద్ధం చెబుతుంటారు.