19 years Teenage Girl Love fell in Love with 70 years Old Man : ప్రేమ గుడ్డిదని అని అంటారు. కానీ ఈ స్టోరీ చదివితే అంతకు మించి అని అంటారేమో. పాకిస్థాన్‌లో  మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 19 ఏళ్ల యువతి.. 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించించింది. అంతేకాదు అతడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా తేడా ఉన్నా.. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. పాకిస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ లవ్ స్టోర వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాహోర్‌కు చెందిన షామైలా (19) రోజు వాకింగ్‌కు వెళ్లేది. అదేసమయంలో లియాఖత్ (70) కూడా రోజు వాకింగ్‌కు వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. లియాఖత్ పాటలకు షామైలా మంత్రముగ్ధురాలైంది. ఈ పరిచయం మాటల నుంచి మొదలై మెళ్లిగా ప్రేమగా మారింది.


ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట్లో వీరి పెళ్లికి షామైలా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆ తరువాత వీరి ప్రేమను చూసి పెళ్లి అంగీకరించారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి చేసుసుకున్నట్లు ఈ నూతన జంట చెబుతోంది. 


లియాఖత్, షామైలా జంట లాహోర్‌లో సంతోషంగా జీవిస్తున్నారు. మీ భర్త వయసు చాలా ఎక్కువ కదా..? ఎలా పెళ్లి చేసుకున్నారు..? అని షామైలాను అడగ్గా.. ప్రేమకు వయసుతో సబంధం లేదని అన్నారు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేమన్నారు. దీనికి కులం, ఎత్తు, వయసు అనే తేడా లేదని చెప్పారు. తాను కూడా ఈ ప్రేమ బంధంలో చిక్కుకుపోయానని తన భర్తపై ప్రేమను వ్యక్తపరిచారు. తన ప్రేమ కథను గురించి లియాఖత్ చెప్పుకొస్తూ.. రొమాంటిక్‌గా ఉండటానికి వయస్సు అవసరం లేదని అన్నారు.  ఈ జంట ఒకరికొకరు పాట పాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.


పాకిస్థాన్‌లో నిత్యం ఏదో ఒక ప్రేమ కథ వైరల్ అవుతోంది. గతంలో ఓ పోలాండ్‌కు చెందిన ఓ వృద్ధురాలికి.. 30 ఏళ్ల పాకిస్థాన్ యువకుడికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ యువకుడి కోసం ఆమె పాకిస్థాన్‌కు వచ్చింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 


Also Read: Rarest Blood Group: ప్రపంచంలో 45 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్.. బంగారం కంటే ధర ఎక్కువే..  


Also Read: Bigg Boss 6 Telugu Prize Money : బిగ్ బాస్ షోలో కొత్త పథకం.. ప్రైజ్ మనీలో కోతలు.. చివరకు మిగిలేది ఎంతంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook