Features Of Sandes App: దేశానికి చెందిన మెసేజింగ్ యాప్ సందేశ్ ప్రారంభమైంది. వాట్సాప్‌ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందేశ్ యాప్ నుండి డేటాను చోరీ చేసే అవకాశాలు మరియు గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని పలు ఫీచర్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్ట్రాంగ్ సందేశ్ ప్రొఫైల్‌
ఈ సందేశ్ యాప్ ద్వారా మీ ప్రొఫైల్‌ను మరింత శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పుట్టినరోజు మరియు జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేయవచ్చు. మీరు ఈ లక్షణాన్ని వాట్సాప్‌లో మీరు పొందలేరు.


Also Read: Moto E7 Power Price: భారత్‌లో మోటో E7 పవర్ మొబైల్ లాంచ్, Moto E7 Power Specifications, ధర పూర్తి వివరాలు


మెయిల్ ద్వారా స్నేహితులతో కనెక్ట్
దేశంలోని నెటిజన్ల తీరును ఆధారంగా సందేశ్ యాప్‌లో కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు. ఉదాహరణకు, స్నేహితుడు లేదా బంధువుతో కనెక్ట్ అవ్వడానికి, మీరు మొబైల్ నంబర్‌పై మాత్రమే ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు మీ స్నేహితులు మరియు బంధువులను ఈమెయిల్ ద్వారా సందేశ్ యాప్‌లో కనెక్ట్ చేయవచ్చు.


ఈమెయిల్ ద్వారా లాగిన్ చేయవచ్చు 
మీ మొబైల్ నంబర్‌తో కాకుండా మీ ఈమెయిల్ ఐడీతో కూడా సందేశ్ యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు. ఇప్పుడు సందేశ్ యాప్‌ను ఏ పరికరం నుంచైనా ఉపయోగించవచ్చు. వాట్సాప్ యాప్‌(WhatsApp)లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు.


Also Read: Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు


చాట్‌బాట్
గత కొన్నేళ్లుగా వాట్సాప్ యూజర్లు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు చాట్‌బాట్‌ను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఈ సమస్యను సందేశ్ యాప్ ద్వారా పరిష్కరించారు. మీరు సందేశ్‌ యాప్ లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. మీరు Help అని టైప్ చేసినప్పుడు చాట్‌బాట్ మీకు సహాయం చేస్తుంది.


Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి


సందేశ్ లాగౌట్ ఫీచర్ (Sandes Logout Feature)
ఇటీవల తీసుకొచ్చిన సందేశ్ యాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ లాగౌట్ ఫీచర్ (Sandes Logout Feature). యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలంటే సందేశ్ యాప్ దీనిని సాధ్యం చేస్తుంది. అలాంటి ఫీచర్ తీసుకురావడానికి వాట్సాప్ కూడా సన్నాహాలు చేస్తోంది. కానీ ఇప్పటివరకూ వాట్సాప్ అయితే ఈ ఫీచర్ అందించలేకపోయింది.
Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook