Viral Video: ఇంటర్నెట్​లో రోజు కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆలోచింపజేసేలా ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. మరికొన్నేమో చాలా సిల్లీగా అనిపిస్తాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


రోడ్డు పక్కన ఉన్న ఓ షాపు వద్దకు అటు నుంచి వెళ్తున్న ఓ కుర్రాడు డొనేషన్స్ కోసం వెళ్లాడు. షాపు బయట నిలబడి డొనేషన్స్​ కోసం అడిగాడు. కొన్ని క్షణాల పాటు అక్కడే ఉన్న ఆ కుర్రాడికి.. షాపు యజమాని డొనేషన్ ఇవ్వలేదు.


దీనితో క్రూడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతటితో కథ ముగిసిపోలేదండోయ్​. యజమాని డొనేషన్​ ఇవ్వకపోయినా.. ఆ కుర్రాడు  ఖాళీ వెళ్లలేదు.


తాను వేసుకొచ్చిన చెప్పులను షాపు బయటే విడిచి.. ఆ షాపు ముందు ఉన్న యజమాని చెప్పులను వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ షాపు ముందు అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


ఇక ఈ వీడియోను.. ghantaa అనే ఇన్​స్టాగ్రామ్​ ఐడీలో షేర్ చేశారు.ఇప్పటికే 47,400 మందికిపైగా వీడియోను లైక్ చేశారు. లక్షల్లో మంది ఈ వీడియోను చూశారు.



ఇక వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కొందరేమో తమ్ముడు ఇది గుడి కాదు చెప్పులు దొంగిలించడానికి అని.. మరికొందరేమో.. ఇది బిజినెస్ ఎక్స్ఛేంజ్ బిజినెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వీడియో చూస్తే ఎంత ఫన్నీగా ఉందో.. వీడియోకు కామెంట్స్ చూసినా అంతే ఫన్నీ ఉంది.


Also read: Viral Video: చీర కోసం ఇంత రిస్కా తల్లి.. కొడుకు ప్రాణాలు పోయేవిగా...


Also read: Viral Video: ఆడ నాగు కోసం.. రెండు మగ నాగుల మధ్య 5 గంటల భీకర యుద్ధం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook