Floods Viral Video: భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరద నీటి ముప్పు, ప్రజల ఇక్కట్లు, పాత ఇళ్లు ధ్వంసమవడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు, చిన్న చిన్న నదులు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ఒక్కసారిగా ఓ నది పొంగడంతో జరిగిన ఆ ఘటన ఒళ్లు జలదరించేలా చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటన హర్యానాలో జరిగింది. రాష్ట్రంలోని పంచ్‌కులలోని ఓ నది ఒడ్డున పార్క్ చేసి ఉన్న ఓ కారు భారీ వర్షాల కారణంగా వరద నీటిలో కొట్టుకుపోసాగింది. ఆ కారులో ఓ మహిళ కూడా ఉంది. వరద నీరు ముంచెత్తడంతో కారు నదిలో ఇరుక్కుపోయింది. భయం గొలుపుతున్న ఉధృతమైన నదీ ప్రవాహంలో కారు కొట్టుకుపోవల్సిదే. నదీ ప్రవాహంలో మహిళతో సహా కొట్టుకుపోతున్న కారును స్థానికులు గమనించారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమెను రక్షించగలిగారు. పక్కనే ఉన్న వంతెనకు తాడు కట్టి ఆ తాడు సహాయంతో దాదాపు 10 మంది ఆ ఉధృతమైన నదీ ప్రవాహంలో దిగిపోయారు. తాడుతో కారుని కట్టి నెమ్మదిగా ఆ మహిళను రక్షించి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే నీళ్లలో స్పృహ కోల్పోయిన ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.




వాస్తనానికి ఈ ఘటన క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. రక్షించేందుకు చాలా తక్కువ సమయముంది. అంతే వేగంగా స్పందించి ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమెను రక్షించిన అక్కడి స్థానికులు నిజంగా ప్రశంసనీయులు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్నాయి. 


ఢిల్లీలో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, సోనిపట్, రోహ్తక్, మీరట్, హాపూర్, బులంద్ షహర్ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయని రీజనల్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ తెలిపింది. 


Also Read: Honeymoon Video: హనీమూన్‌లో కొత్త జంట రచ్చ రచ్చ.. స్విమ్మింగ్ పూల్‌లో లోదుస్తులతో రొమాన్స్.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి