Viral video: అతి వేగం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. నిత్యం వార్తల్లో ఇలాంటి ఎన్నో విషయాలను చూస్తుంటాం, చదువుతుంటాం. ప్రమాదాల బారి నుంచి తప్పించుకున్న చాలా మంది.. తృటిలో బతికిపోయాను.. లేదంటే అంతే సంగతులు అని చెప్పడం కూడా వింటుంటాం. అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి (Karnataka Man escape from accident) చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే వ్యక్తి రెండు సార్లు అది కూడా సెకన్ల తేడాలో చావు నుంచి తప్పుంచుకుని బతికి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral scooty video)​ అవుతోంది.


వీడియోలో ఏముందంటే..


ఓ వ్యక్తి స్కూటర్​పై అటుగా వేగంగా వస్తున్నాడు. అదే సమయంలో ఓ బస్సు యూటర్న్​ తీసుకుంటోంది. ఆ వ్యక్తి స్పీడ్​ కంట్రోల్ చేయలేక పోయాడు. దీనితో బస్సుకు ముందు నుంచి అతి కొద్ది దూరంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఇక్కడితో అతడికి ప్రమాదం (Karnataka viral scooty bus accident) తప్పిపోలేదు.



ఆ బస్సును తప్పించుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి స్కూటర్​ను అదుపు చేయలేకపోయాడు. అదుపు చేసే ప్రయత్నంలో రోడ్డు నుంచి పక్కకు వెళ్లాడు. ముందు వైపు ఓ చిన్న దుకాణం దాని పక్కన ఓ చెట్టు ఉండగా.. వాటి వైపు దూసుకెళ్లాడు. ఈ సారి కూడా ఆ వ్యక్తి అదృష్టం బాగుంది. చెట్టు, దుకాణం మధ్య అత్యంత సన్నని మార్గం ఉండగా.. దానిలోంచి వెళ్లాడు. అదే సమయంలో అతడి తలపై నుంచి హెల్మెంట్ జారి కింద పడింది. లక్కీగా ఈ సారి కూడా అతడికి ఏం (Scooty accident escape) కాలేదు.


ఈ ఘటన కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాలోని ఎలియరుపాడవు ప్రాంతంలో జరిగింది. ఈ  దృశ్యాలన్ని అక్కడే ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు కర్ణాటకతో పాటు.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ (Mangaluru viral scooty video) అవుతోంది.


Also read: Facebook: జపాన్‌లో ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ, పింట్రెస్ట్‌కు పెరుగుతున్న ఆదరణ


Also read: Pig Heart Surgery: వైద్య చరిత్రలో అద్భుత పరిణామం- మనిషికి పంది గుండె అమర్చి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook