Aliens in Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీ వీధుల్లో కనిపించిన ఓ చిన్న జీవి.. ఇప్పుడు పలువురు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాడబుల్ అనే నివేదిక ప్రకారం.. హ్యారీ హేస్ అనే వ్యక్తి సిడ్నీ వీధుల్లో ఉదయం జాగింగ్ చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఓ వింత జీవిని గమనించాడు. ఈ మధ్య కాలంలో నగరంలో భారీ వర్షాలు కురిసినా.. ఈ వింత జంతువు ఎవరి కంట పడేలేదని శాస్త్రవేత్తలతో పాటు స్థానికులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వింత జీవితో భయాందోళనలు..


తనకు కంటపడిన ఆ వింత జీవి గురించి హ్యారీ హేస్ ఈ విధంగా స్పందించారు. "ఇది ఒక రకమైన పిండం అని నేను భావిస్తున్నా. కానీ, ప్రపంచంలో గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా వైరస్, తుఫానులు, మూడవ ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రహాంతవాసులు భూమిపైకి వచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుకుంటున్నాను" అని హ్యారీ వెల్లడించారు. ఆ వింత జీవికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో హ్యారీ షేర్ చేశాడు. 



ఉలిక్కిపడిన స్థానికులు 


హ్యారీ హేస్ పోస్ట్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వింత జీవి ఏలియన్ అని ఆస్ట్రేలియన్స్ భయాందోళనలకు లోనవుతున్నారు. దీనిపై పలువురు అనేక కామెంట్స్ కూడా చేశారు. బహుశా అది సొరచేప పిండం లేదా మరేదైన సముద్ర జీవి అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. జీవశాస్త్ర వేత్తలు కూడా ఆ వింత జీవి ఏమిటని ఆశ్చర్యపోయారు.  


Also Read: Peacock vs Goat Viral Video: నెమలి, మేక మధ్య ఫన్నీ ఫైట్? ఎది గెలుస్తుందో చెప్పగలరా?


ALso Read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook