Sandhya Theater Stampede: సినీ పరిశ్రమతోపాటు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సంచలనం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో "పుష్ప 2' విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంలో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. బన్నీని అదుపులోకి తీసుకునే సమయంలో చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!  


అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం ఉదయం 11 గంటలకు అలా చేరుకున్నారు. ఆ సమయంలో నేరుగా పోలీసులు ఇంట్లోకి వచ్చారని తెలుస్తోంది. ఇంటి బయట అల్లు అర్జున్‌ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. 'మీరు పిలవడం సరే కానీ నేరుగా బెడ్రూమ్‌లోకి వెళ్లడం తప్పు' అని అల్లు అర్జున్‌ పోలీసు అధికారులతో చెప్పారు. ఆ సమయంలో బన్నీ కాఫీ తాగుతూ కనిపించాడు.

Also Read: Allu Arjun Arrest: బిగ్ బ్రేకింగ్.. అల్లు అర్జున్ అరెస్ట్  


'మేం ఏమేం వాగ్వాదం చేయలేదు. సార్‌ మీరు తీసుకెళ్లడం తప్పు లేదు. మీరు చేయడం తప్పు లేదు. మరి బెడ్రూమ్‌ బయటకు వచ్చి అలా చేయడం తప్పు అని చెబుతున్నా' అని అల్లు అర్జున్‌ నవ్వుతూనే తప్పుబట్టారు. ఇక బన్నీ నాన్న అల్లు అరవింద్‌ పోలీస్‌ కారులో ఎక్కుతుంటే 'ఎందుకు నాన్న వద్దు' అని బన్నీ నిరాకరించాడు. దానికి పోలీస్‌ అధికారి 'రానివయ్యా. ఆయన తండ్రి కాదా' అని చెప్పాడు.


అయితే పోలీస్‌ కారులో అరవింద్‌ ఎక్కిన అనంతరం మళ్లీ దిగారు. 'బాగుండదు సార్‌. మళ్లీ అనవసరం మీకు సంబంధం లేని విషయం అవసరం లేదు. ఏ క్రెడిట్‌ వచ్చినా నా నెత్తి మీద ఉండాలి. గుడ్‌ అయినా.. బాడ్‌ అయినా' అంటూ తండ్రి అరవింద్‌ను దింపేసి అల్లు అర్జున్‌ పోలీస్‌ కాన్వాయ్‌ ఎక్కాడు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్‌ ధైర్యం చెప్పారు. ఏం కాదు అంటూ ధైర్యం చెబుతూ పలుమార్లు ఆమెను ముద్దాడారు. అల్లు అరవింద్‌, తన సోదరుడు అల్లు శిరీష్‌కు కూడా ధైర్యం ఇచ్చారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.