Ranu Mondal Dances to Allu Arjun Song: సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌‌గా మారింది. ఇన్‌స్టా రీల్స్‌లలో పుష్ప మూవీ సాంగ్స్, డైలాగ్స్ మోగిపోతున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుంచీ ప్రతి ఒక్కరూ పుష్ప.. పుష్ప రాజ్‌ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తగ్గేదేలే అనట్లుగా పుష్ప మూవీలోని పాటలకు డ్యాన్స్‌లు చేసి వీడియోలు పోస్ట్‌ చేస్తుంటే... సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అయిపోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పుష్ప మూవీలోని అల్లు అర్జున్ హుక్ స్టెప్‌నకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్టెప్స్‌ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు ఈ వీడియోలే కనిపిస్తున్నాయి. సినీ తారలు, క్రికెటర్స్‌ పుష్ప మూవీలోని పాటలకు డ్యాన్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నారు.


పుష్ప మూవీలోని శ్రీవల్లి పాట అన్ని భాషల్లో ఫుల్ పాప్‌లర్‌‌ అయింది. ఆ పాటలో బన్ని హుక్ స్టెప్‌ను అనుసరిస్తూ ఇప్పుడు అందరూ డ్యాన్స్ దుమ్ము లేపేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ స్టెప్‌ వేసి తమ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. 


ఇక ఓవర్‌‌నైట్‌ స్టార్ సింగర్‌‌గా సంచలనం సృష్టించిన రాను మండల్‌ ఇప్పుడు శ్రీవల్లి హిందీ వెర్షన్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ వేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైర​ల్ అవుతోంది. చేతిలో ఒక కర్రను పట్టుకుని తనదైన స్టైల్‌లో ఆమె హుక్ స్టెప్‌ వేసేందుకు ట్రై చేసింది.



యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోపై నెటిజన్స్‌ పలు కామెంట్స్‌ చేస్తున్నారు.. కొందరు ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటుండగా.. మరికొందరేమో ఇదేమీ డ్యాన్స్ అంటూ విమర్శిస్తున్నారు. అసలు ఈమె డ్యాన్స్‌ చేస్తుందా లేదా మజాక్ చేస్తుందా అని కొందరు అంటుండగా.. దీదీ ఇది మీతో కానీ పనిలే అని మరికొందరు అంటున్నారు. ఇంకొకరేమో ఈమె ఫేమస్‌ కావడానికి ఏదైనా చేస్తుందని కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో మాత్రం యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఏడు లక్షల మందిపైగా ఈ వీడియోను చూశారు.


Also Read: పోలింగ్‌బూత్‌కు కోహ్లీ.. సెల్పీలు దిగిన ఫాన్స్! చివరకు ట్విస్ట్!!


Also Read: Ratan Tata: రతన్‌ టాటాను 'ఛోటూ' అన్న అమ్మాయి.. వ్యాపార దిగ్గజం ఏం రిప్లై ఇచ్చారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook