Amazon: అమెజాన్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సేవల్లో తీవ్ర అంతరాయం
Amazon: ప్రముఖ ఆన్‌లైన్ వాణిజ్య వేదిక అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా సమస్య ఎదురైంది. ఒక్కసారిగా ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ట్విట్టర్‌లో ఫిర్యాదులు ట్రోల్ అయ్యాయి.
Amazon: ప్రముఖ ఆన్‌లైన్ వాణిజ్య వేదిక అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా సమస్య ఎదురైంది. ఒక్కసారిగా ఆన్‌లైన్ షాపింగ్‌లో అంతరాయం కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ట్విట్టర్‌లో ఫిర్యాదులు ట్రోల్ అయ్యాయి.
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు(Amazon) ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి నుంచి ఇవాళ్టి వరకూ అంటే 12 గంటలకు పైగా ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారు. లాగిన్, షాపింగ్ సమస్యలతో పాటు ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలకు ఇబ్బంది ఏర్పడింది. ఫలితంగా ట్విట్టర్‌లో అమెజాన్‌పై ఒక్కసారిగా ఫిర్యాదులతో ట్రోలింగ్ నడిచింది. ఇంటర్నెట్‌లో అంతరాయాల్ని గుర్తించే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్.కామ్ ప్రకారం అమెజాన్‌లో పలు రకాల సేవలకు గంటల కొద్దీ అంతరాయమేర్పడింది. 40 వేలకు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు వెబ్ సర్వీసెస్‌లో కూడా సమస్య వచ్చింది. ఫలితంగా అమెజాన్, ప్రైమ్ వీడియో(Amazon Prime), అలెక్సా సేవలు నిలిచిపోయాయి.
ఇండియాతో పాటు యూకే, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్‌లలో వినియోగదారులు అమెజాన్ డౌన్ (Amazon Down)అంటూ ట్రోలింగ్ ప్రారంభించడంతో సంస్థ రంగంలో దిగింది. సమస్యను పరిష్కరించింది. ఇబ్బందులు తలెత్తని విషయం నిజమేనని..సమస్యల్ని పరిష్కరించామని, ప్రస్తుతం అంతా సక్రమంగా ఉందని అమెజాన్ తెలిపింది. సమస్య ఎందుకు ఎదురైందనేది మాత్రం వెల్లడించలేదు.
Also read: Amazon prime day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్లు, జూలై 26, 27 తేదీల్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook