Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..
Viral video: ప్రీవెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త జంట అందమైన కాస్ట్యూమ్ లు వేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు ఫోజులు ఇస్తున్నారు. వీరికి బోట్ లో ఉన్న తాత చెప్పిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Prewedding Shoot goes viral on social media: మనలో చాలా మంది పెళ్లి వేడుకలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించుకుంటారు. వివాహా వేడుకల కోసం ఎంత డబ్బులు చేయడానికి కూడా అస్సలు వెనుకాడరు. పెళ్లి కోసం ఈవెంట్ ఆర్గనైజర్ లను కలుసుకుంటారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతిఒక్క వేడుక జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకునేందుకు ప్లాన్ లు చేసుకుంటారు. దీనీ కోసం ఎంత ఖర్చుకైన అస్సలు వెనక్కు తగ్గరు. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్రీవెడ్డింగ్ వేడుకలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వెరైటీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లు తరచుగా ట్రెండింగ్ లలో ఉంటున్నాయి.
ప్రీవెడ్డింగ్ అనేది ఒక పెద్ద కమర్షియల్ బిజినెస్ లాగా మారిపోయింది. దీని కోసం భారీగానే సెట్టింగ్ లు వేయడం, నేచర్ లో లోకేషన్ లు ఉండేలా ఈవెంట్ ఆర్గనైజర్ లు ప్లాన్ లు చేసుకుంటున్నారు. లోకేషన్ లను బట్టి, ప్రీవెడ్డింగ్ కోసం ధరలను డిసైడ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రీవెడ్డింగ్ షూట్ తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
కొత్త జంట తమ పెళ్లి కోసం ప్రీవెడ్డింగ్ ను కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో కొత్త జంట కాస్లీ కాస్ట్యూమ్ లు వేసుకుని ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే.. వీరి ఈవెంట్ ఒక బోట్ మీద నదిలో షూట్ చేస్తున్నారు. దూరం నుంచి ఈవెంట్ మెనెజర్.. కొత్తజంటకు ఎలా ఫోజులివ్వాలో చెప్తున్నారు. కొత్త జంట మాత్రం.. డైరెక్టర్ చెప్పిన విధంగా కాకుండా, మరోక విధంగా చేస్తున్నారు. ఇదంతా అక్కడే ఉన్న, బోట్ ను నడిపిస్తున్న ఒక తాత గమనించాడు. అతను కాస్త ఇంట్రెస్ట్ గా కొత్త జంటకు ఫోజులు ఎలా ఇవ్వాలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇలా అమ్మాయిని పట్టుకొవాలి.. అలా నడుముదగ్గర చేయిపెట్టి పట్టుకో అంటూ చెప్తున్నాడు.
Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?
ఇక తాత.. ట్రైనింగ్ ఇవ్వడం చూసి, కొత్త జంట ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయిన కూడా తాత.. వారిని ఏమాత్రం వదలకుండా.. కొత్త జంటకు ఫోజులు ఇవ్వాలని చెప్తున్నాడు. ఈ ఘటన ఏపీలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. తాత మంచి జోరు మీదున్నాడు.., తాత.. టిప్స్ పాటించండంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. పెద్దాయన అస్సలు.. రాంగ్ ప్లేస్ లో ఉన్నాడని, కొత్త జంటకు భలే ట్రైనింగ్ ఇస్తున్నాడని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter