Bear Trying To Attack Man Viral Video: అడవిలో సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో వణ్యప్రాణులను, కృూరమృగాలను అసలే డిస్టర్బ్ చేయకూడదు. విజ్ఞానం కోసం, విహారం కోసం వణ్యప్రాణులను దూరం నుంచి చూశామా.. ఎంజాయ్ చేశామా, తిరిగొచ్చామా అన్నట్టుగా ఉండాలి కానీ అక్కడి వణ్య ప్రాణులను డిస్టర్బ్ చేసేటట్టుగా ప్రవర్తించినా లేక వాటి ముందుకు వెళ్లి నిలబడి ఏమైనా పిచ్చిపిచ్చి వేషాలు వేసినా.. అవి మీ సరదా తీరేలా పట్టపగలే చుక్కలు చూపించడం ఖాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదండి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మొత్తం స్టోరీ ఏంటో మీకే అర్థం అవుతుంది. అటవీ ప్రాంతంలో అనుకోకుండా ఓ ఎలుగుబంటి కంటపడిన ఓ వ్యక్తి.. దాని బారి నుంచి తప్పించుకోవడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏమైందంటే.. అడవిలో ఓ వ్యక్తిని చూసిన ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు వెంటపడింది. తనని వెంబడిస్తున్న ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అతడి బుర్రలో మెరిసిన ఐడియా ఏంటంటే.. తన కళ్ల ముందు కనిపించిన చెట్టు ఎక్కి తప్పించుకోవాలనుకున్నాడు.


అనుకున్నదే తడవుగా ఆ చెట్టుపైకి ఎగబాకడం మొదలుపెట్టాడు. కానీ అంతలోనే ఎలుగుబంటి అతడిని చేరుకుంది. అప్పటికి అతడు ఇంకా పూర్తిగా పైకి ఎక్కలేదు. చెట్టుపైకి ఎక్కడం ప్రారంభించిన వ్యక్తిని కింద నిలబడే అతడి కాలు పట్టి కిందకు లాగే ప్రయత్నం చేసింది. అచ్చం మనిషి లాగే అతడిని కిందకు లాగేందుకు ఎలుగుబంటి విశ్వప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. 



ఇది కూడా చదవండి : Real Fighting Scene: తన గాళ్ ఫ్రెండ్ జోలికి వచ్చిన ఇద్దరిని ఒక్కడే చితక్కొట్టాడు


చివరకు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు లేవు కానీ.. అతడిని కిందకు లాగేందుకు ఎలుగుబంటి ప్రయత్నిస్తున్న తీరు చూస్తోంటే.. చివరకు ఎలుగుబంటి అయినా ఆ చెట్టుపైకి ఎక్కి ఉండాలి.. లేదంటే అతడు చెట్టు దిగొచ్చే వరకు ఆ ఎలుగుబంటి అక్కడే నిలబడి ఉండొచ్చునేమో అనేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.


ఇది కూడా చదవండి : Viral Video: దెయ్యమే వచ్చి కారును ఢీకొందా ? వీడియోను జాగ్రత్తగా చూడండి