Ghost Car Accident: అంతుచిక్కని కారు ప్రమాదం.. ఎదురుగా ఏ వాహనము లేదు కానీ.. తుక్కు తుక్కు అయిన కారు!

Mysterious Car Accident Video: ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో ఒక తెల్లటి కారు ఒక చౌరస్తాను క్రాస్ చేసే క్రమంలో భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురవడం చూడవచ్చు. సీసీటీవీ విజువల్స్ ప్రకారం.. ఏదో భారీ వాహనం ఎంతో వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల ఆ కారు అంతే వేగంగా వెనక్కి ఎగిరొచ్చి పడినట్టుగా అనిపిస్తుంది. అయితే, మీరు నిశితంగా పరిశీలిస్తే.. మీకు మరో విషయం అర్థమవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 09:04 AM IST
Ghost Car Accident: అంతుచిక్కని కారు ప్రమాదం.. ఎదురుగా ఏ వాహనము లేదు కానీ.. తుక్కు తుక్కు అయిన కారు!

Mysterious Car Accident Video: గతంలో మీరు ఎన్నో రోడ్డు ప్రమాదాలను కళ్లారా చూసి ఉండుంటారు. లేదంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలను చూసి ఉంటారు. అలా మీరు చూసిన దృశ్యాల్లో అత్యధిక శాతం ఘటనల్లో రెండు వాహనాలు ఎదురెదురుగానో లేక మరోవైపు నుంచో వచ్చి ఢీకొన్న ఉదంతాలే ఎక్కువగా ఉంటాయి. లేదంటే అవతలి వైపు ఏ వాహనం లేకున్నప్పటికీ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లో లేక డ్రైవర్ నిద్రమత్తులోనో లేక తాగిన మత్తులో ఉండటం వల్లో జరిగిన ప్రమాదాలే అధికంగా ఉంటాయి. కానీ ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా అరుదైనది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కచ్చితంగా మీరు గతంలో ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. 

ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో ఒక తెల్లటి కారు ఒక చౌరస్తాను క్రాస్ చేసే క్రమంలో భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురవడం చూడవచ్చు. సీసీటీవీ విజువల్స్ ప్రకారం.. ఏదో భారీ వాహనం ఎంతో వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల ఆ కారు అంతే వేగంగా వెనక్కి ఎగిరొచ్చి పడినట్టుగా అనిపిస్తుంది. అయితే, మీరు నిశితంగా పరిశీలిస్తే.. ఈ కారును మరో వాహనం వచ్చి ఢీకొన్నట్టుగా ఎలాంటి ఆధారం కనపడదు. మరొకసారి ఈ వీడియోను రీప్లే చేసి చూస్తే అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reels Engenharia (@reelsengenharia)

ఇది కూడా వీక్షించండి : Real Fighting Scene: తన గాళ్ ఫ్రెండ్ జోలికి వచ్చిన ఇద్దరిని ఒక్కడే చితక్కొట్టాడు

చూశారా.. రోడ్డు క్రాస్ చేసి మరోవైపునకు రాబోతున్న తెల్ల కారు రోడ్డు ప్రమాదానికు గురైనప్పటికీ.. ఆ కారును మరొక వాహనం వచ్చి ఢీకొవ్వ దాఖలాలు ఏవీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో తెలియక ఈ వీడియో చూసిన జనం జుట్టు పీక్కుంటున్నారు. ఈ కారు ప్రమాదానికి కారణమైన ఆ అదృశ్య శక్తి ఏంటా అనే అంతు చిక్కని ప్రశ్న ఈ వీడియో చూసిన వారి మెదడుని తొలిచివేస్తోంది. 

అయితే, ఈ వీడియో చూసిన వారిలో కొంతమందికి వస్తోన్న సందేహం ఏంటంటే.. కొంపతీసి ఈ రోడ్డు ప్రమాదానికి దెయ్యం ఏమైనా కారణం అయ్యుంటుందా అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడ ఏమీ కనిపించకపోగా.. ఏదో వాహనం బలంగా ఢీకొన్నంత భారీ ప్రమాదం జరిగింది. కంటికి కనిపించని ఆ అదృశ్య శక్తి దెయ్యమే అయ్యుంటుందా అనేది కొంతమంది అనుమానం. ఇంకొంతమంది స్పందించే తీరు చూస్తే.. వీడియోను మార్ఫింగ్ చేసి అందులో రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తొలగించారు అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవం ఏంటో అంతుచిక్కకపోవడంతో దెయ్యమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమై ఉంటుందనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా వీక్షించండి : Viral Video: హీరోయిన్స్‌ని మైమరిపించేలా, కుర్రకారుకు పిచ్చెక్కెలా స్టెప్పేసిన ఆంటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News