Snakes crawl: బాప్ రే.. బాత్రూంలో బైటపడిన 30 కు పైగా పాములు.. షాకింగ్ వీడియో వైరల్..
Assam news: నాగావ్ జిల్లాలోని ఒక ఇంటిలో నుంచి 30 వరకు పాము పిల్లలు బైటపడ్డాయి. బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీయగానే పాము పిల్లలు పైకి రావడం చూసియువకుడు షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Assam above 30 snakes crawl out of from wash room in Kaliabor: మనలో చాలా మంది పాములంటేనే భయంతో వణికిపోతారు. పొరపాటున కూడా పాములు కన్పిస్తే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి అస్సలు సాహాసం చేయరు. ఇక కొన్నిసార్లు పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పాములు అడవులు, కొండ ప్రాంతాలు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా కన్పిస్తాయి. చెట్లు ఉన్న చోట, ఎలుకల సంచారం ఎక్కువగా ఉన్న చోట పాములు ఉంటాయి.
కొందరు పాముల్ని చూసి భయపడిపారిపోతుంటే, మరికొందరు మాత్రం.. పాములు కన్పించగానే వాటిని ఆపద తలపెట్టరు. వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందిస్తారు. కొందరు పాములను దేవతలా కొలుస్తారు. పాములకు ఆపద తలపెడితే కాలసర్పదోషం కల్గుతుందని భావిస్తారు. అందుకే పాములను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపద తలపెట్టరు. ఇదిలా ఉండగా.. కొందరు పాములకాటుకు గురౌతుంటారు.
అలాంటి సమయంలో కాటు వేసిన పాములను ఏకంగా ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనలు కూడా అనేకం వార్తలలో నిలిచాయి. ఇక పాములు కొన్నిసార్లు ఇళ్లలో కుప్పలు కుప్పలుగా బైటపడిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. పాములు ముఖ్యంగా వర్షాకాలంలో మన ఇళ్లలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. బియ్యం బస్తాలు, గోధుమల వడ్ల దగ్గరు ఎలుకలుఎక్కువగా తిరుగుతుంటాయి. వీటి వేటలో పాములు ఆయా చోట్ల మనకు కన్పిస్తాయి. పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని పాముల వీడియోలు చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
అస్సాంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగోన్ జిల్లాలోని కలియాబోర్ పట్టణంలో ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్లాలని డోర్ తీశాడు. ఇంతలో బాత్రూమ్ నుంచి పదులు సంఖ్యలో పాము పిల్లలు బైటికి వచ్చాయి. అతగాడు పాముల్ని చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే భయపడిపోయి చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. అక్కడ పాముల్ని పట్టుకునే సంజీబ్ దేకా అనే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అతను దాదాపు 30 కి పైగా పాముల పిల్లలను బైటకు తీశాడు.
అంతేకాకుండా.. వాటిని రెస్క్యూ చేసి దగ్గరలోని అడవిలో వదిలేశాడు. గతంలో ఇతను.. కలియాబోలోని ఒక ఇంటి నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించాడు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దీని తల్లి కూడా అక్కడే ఉండవచ్చు.. టేక్ కేర్ అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter