Australia: ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడి(bananas farm worker)పై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియా(Australia)లో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
క్వీన్స్‌ల్యాండ్‌(Queensland)లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్‌ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్ల నుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టు(banana tree) కూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్(Long bottom) వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్‌ల్యాండ్‌ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది.


Also read: HP Bumper Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి.. రూ.10వేల బంగారం గెలవండి!


ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు(Queensland Supreme Court) అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook