Apple watch for monitoring Lion heartbeat : కొన్ని సార్లు అడవిలోని జంతువులు కూడా గాయాలపాలౌతాయి. జంతువులు పరస్పరం పొట్లాడుకున్న సందర్భాలలో ఇలాంటి గాయలు జరగడం మనం చూస్తుంటాం. ఇక క్రూర జంతువులు వేటకు వెళ్లినప్పుడు కూడా.. కొన్నిసార్లు జంతువుల ఎదురు దాడుల్లో గాయలపాలౌతుంటాయి. కానీ అడవిలో కొన్నిసార్లు ఫారెస్ట్ సిబ్బంది, ఇలాంటివి తమకు తెలిసినప్పుడు వెంటనే వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇస్తారు. అడవిలో ఫారెస్ట్ సిబ్బంది, ఆయా అధికారులు పలు చోట్ల... సీసీ కెమెరాలను అమరుస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో.. కొన్నిసార్లు ఫారెస్టు సిబ్బంది, వెటర్నరీ వైద్యులతో కలిసి, మత్తు ఇంజక్షన్ లు ఇచ్చి గాయపడిన జంతువులకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక సింహనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అది కూడా దాని నాలుకకు ఒక యాపిల్ వాచ్ ను పెట్టి మరీ దాన్ని కదలికలను అబ్జర్వ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఆస్ట్రేలియాలోని జరిగిన ఈ ఘటన ఇప్పుడు వార్తలలో నిలిచింది. పశువైద్యుడు డాక్టర్ క్లో బ్యూటింగ్.. ఇటీవల గాయపడిన సింహనికి వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో దాని నాలుకకు యాపిల్ వాచ్ ను పెట్టి మరీ ట్రీట్మెంట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో దాదాపుగా అందరు స్మార్ట్ వాచ్ లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల మన శరీరంలో కలిగే ప్రతి ఒక్క మార్పును అంచనా వేయోచ్చు. అంతేకాకుండా... గుండె కొట్టుకొవడం, బీపీ, శరీరంలో మార్పులు అన్నింటిని స్మార్ట్ వాచ్ ఖచ్చితంగా గమనిస్తుంటుంది.


ఇప్పటికే చాలా మంది స్మార్ట్ వాచ్ లో రీడింగ్ ను చూసి.. కాస్త మార్పులు తేడాగా రావడంతో సమయానికి డాక్టర్ ల దగ్గరకు వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి స్మార్ట్ వాచ్ ను ఇప్పుడు సింహంకు చికిత్స చేయడానికి వైద్యులు ఉపయోగించారు. అడవిలో గాయపడిన సింహన్ని మత్తుఇంజక్షన్ ఇచ్చి, వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. అంతేకాకుండా.. దాని శరీరంలోని కదలికలను అంచనావేయడానికి, దాని నాలుకకు యాపిల్ వాచ్ లను అమర్చారు. దీనితో ఖచ్చితమైన రీడింగ్ తెలుసుకుని, దానికి తగ్గవిధంగా ట్రీట్మెంట్ ఇవ్వోచ్చని వైద్యులు చెబుతున్నారు.


Read more: Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..


ఏనుగులకు కూడా గతంలో వాటి చెవికి యాపిల్ వాచ్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.  మనిషి అంటే తన సమస్యలను చెప్పగలడు . కానీ నోరులేని జీవాలు తమ వేదనను చెప్పలేవు. కాబట్టి.. ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ని వైద్యులు వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. ఇదేం వింత... అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter