Baba Ka Dhaba Owner Opens New Restaurant:  కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు అల్లాడిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు సైతం కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన వారిలో బాబా కా దాబా (Baba Ka Dhaba) ఓనర్ దంపతులు ఉన్నారు. అయితే తాజాగా వీరి దశ తిరిగింది. ఏకంగా రెస్టారెంట్‌నే ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇప్పుడు బాబా కా దాబా (Baba Ka Dhaba) ఓనర్ కాంత ప్రసాద్ తాతను చూస్తే గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే.. గతంలో మనకు ఆయన ఏడుస్తూ తన ధీనస్థితిని వివరించడమే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో కొత్తగా రెస్టారెంట్‌ను ప్రారంభించారు బాబా కా దాబా (#BabaKaDhaba) ఓనర్ కాంత ప్రసాద్. ఆయన కష్టాన్ని చూసి చలించిపోయిన నెటిజన్లు తమ వంతుగా విరాళాలు అందజేశారు. వీటి ఫలితమే ఈ కొత్త రెస్టారెంట్.


Also Read: Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు


 




ప్రస్తుతం తాము సంతోషంగా ఉన్నామని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. కరోనా వైరస్ (CoronaVirus) వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని, అయితే దేవుడు తమను ఆశీర్వదించాడని, తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ బాబా కా దాబా ఓనర్ కాంత ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. గతంలోలాగే ఇప్పుడు కూడా తమను ప్రజలు ఆధరించాలని, తమ రెస్టారెంట్‌కు విచ్చేసి భారతీయ, చైనా వంటకాలను రుచిచూడాలని కోరారు.


Also Read: Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్


 



 


ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో 80ఏళ్లకు పైగా ఉన్న కాంత ప్రసాద్ తాత తన భార్య బదమా దేవీతో కలిసితో రోడ్డుపక్కన చిన్న దాబా నడిపేవారు. అయితే లాక్‌ డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా గిరాకీ లేకపోవడంతో పూట కూడా గడవటం కష్టమైందని బాబా కా దాబా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వయసులోనూ సొంతంగా కష్టపడి పనిచేస్తున్నారని, వీరి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు చందాలు అందించారు. దీనిపై తర్వాత వివాదం సైతం తలెత్తడం తెలిసిందే. 


Also Read: Rakul Preet Singh: కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్‌‌.. ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook