Eat 8Kg Samosa in 30 Minutes and wins Rs 51000 thousand: భోజన ప్రియులందరీ ఓ శుభవార్త. ముఖ్యంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఆహరం తినగల సామర్థ్యం ఉన్న వారికి. ఎక్కువ ఆహరం తినేవారు రూ. 51,000 నగదు బహుమతిని గెలుచునే సదావకాశం మీ ముందుంది. అందుకు మీరు చేయాల్సింది మరేమీ లేదు. 30 నిమిషాల్లో ఓ భారీ సమోసా (బాహుబలి సమోసా)ను మొత్తం తినడమే. ఈ ఫుడ్ ఛాలెంజ్ మీరట్‌లోని కుర్తీ బజార్‌లోని ఓ స్వీట్ షాప్‌లో ఉంది. అసలు ఈ ఛాలెంజ్ ఏంటనే వివరాల్లోకి వెళ్లుదాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరట్‌కు చెందిన శుభమ్‌‌ కౌశల్ అనే వ్యాపారి లాల్‌కుర్తి బజార్‌లో 'కౌశల్ స్వీట్స్' పేరుతో స్వీట్ షాపు రన్ చేస్తున్నాడు. ఆ షాపులో ఎన్నో వెరైటీల  సమోసాలతో పాటు స్వీట్స్, పకోడిలు చాలా ఫేమస్. తమ సమోసాలకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చేంచుకు కొత్తగా చేయాలని శుభమ్ ఆలోచించాడు. ఇటీవల కాలంలో ఫుడ్ ఛాలెంజ్‌ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడంతో.. అతడికి ఓ ఐడియా తట్టింది. 4 కిలోల సమోసా తయారు చేసి ఫుడ్ ఛాలెంజ్‌ పెట్టాడు. ఇది తింటే రూ. 11 వేలు ఇస్తానని ప్రకటించాడు. అది చాలా ఫేమస్ అయింది.  


కస్టమర్లను మరింతగా ఆకట్టునేందుకు ఈసారి ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. దానికి 'బాహుబలి సమోసా'గా పేరు పెట్టాడు. ఎవరైనా సరే ఈ బాహుబలి సమోసాను 30 నిమిషాల్లో తింటే.. ఆ వ్యక్తికి రూ. 51 వేల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ స్వీట్ షాప్ పేరు మీరట్‌లో మార్మోగిపోతోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఈ ఛాలెంజ్‌లో విజయం సాధించలేదు. చాలా మంది ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. 


శుభమ్‌‌ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ... 'ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఉద్ధేశ్యంతోనే సమోసా చాలెంజ్‌ను ప్రకటించా. ముందుగా 4 కిలోల సమోసాతో చాలెంజ్‌ ప్రారంభించా. ఇప్పుడు 8 కిలోల చాలెంజ్‌ నడుస్తోంది. 8 కిలోల సమోసా ధర దాదాపు రూ. 1100 ఉంటుంది. ఇందులో బంగాళదుంపలు, బఠానీలు, కాటేజ్ చీజ్, డ్రై ఫ్రూట్‌లు ఉంటాయి. ఇప్పటివరకు ఎవరూ ఈ ఛాలెంజ్‌లో విజయం సాధించలేదు. త్వరలో 10 కిలలో సమోసా చేస్తాం. కస్టమర్లు పెరిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫుడ్ బ్లాగర్లు బాహుబలి సమోసా చూసేందుకు వస్తున్నారు. రీల్స్ కూడా చేస్తున్నారు' అని చెప్పాడు. 


Also Read: Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధానిని అందుకే చంపా.. సంచనల విషయం చెప్పిన షూటర్!


Also Read: Shinzo Abe Dies: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి.. పట్టుబడిన షూటర్! ఫొటోస్ ఇవే



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook