Bala Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు సౌలభ్యాల్ని ప్రకటిస్తోంది యూఐడీఏఐ. ఇప్పుడు పుట్టిన పిల్లల కోసం బాల ఆధార్ కార్డు ప్రవేశపెడుతోంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్ లేకుండానే. ఎలాగో తెలుసా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం ఆధార్(Aadhaar) అవసరం. ఆధార్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఆధార్ కార్డు అనివార్యం. బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ కార్డు తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు సరికొత్తగా బాల ఆధార్ కార్డు ప్రవేశపెట్టారు. ఈ కార్డు తీసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. బర్త్ సర్టిఫికేట్ లేకుండానే బాల ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అప్పుడే పుట్టిన చిన్నారికి ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఉంటే చాలు. చిన్నారులకు 5 ఏళ్లు నిండిన తరువాత బయోమెట్రిక్ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ బాల ఆధార్ కార్డు పనిచేయదు. బాల ఆధార్ కార్డు(Baal Aadhaar Card) అనేది 5 ఏళ్ల వరకూ ఉపయోగించాల్సి ఉంటుందని..ఆ తరువాత బయోమెట్రిక్ చేయించకపోతే పనిచేయదని యూఐడీఏఐ ట్వీట్ ద్వారా తెలిపింది. బాల ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలో వివరించింది.


https://appointments,uidai.gov.in/easearch.aspx ద్వారా పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్(Biometric update) చేసుకోవాలి. పిల్లల బయోమెట్రిక్‌ను ఐదేళ్ల తరువాత, తిరిగి 15 ఏళ్లతరువాత అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం అప్పాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా UIDAI ఇచ్చిన లింక్‌లో లాగిన్ కావాలి. అప్పాయింట్‌మెంట్ కోసం రాష్ట్రం, పోస్టల్ పిన్‌కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకుని..నిర్దేశిత సమాచారాన్ని ఎంటర్ చేయాలి. లొకేట్ సెంటర్ బటన్ క్లిక్ చేయాలి. మీకు సమీపంలోని ఆధార్ కేంద్రం కన్పిస్తుంది. అక్కడ అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సహా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. 


Also read: వాట్సాప్‌ ఫీచర్స్‌తో సందేశ్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook