Sandes app features vs whatsapp features: న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పోటీగా కేంద్రం సందేశ్ అనే ఓ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సందేశ్ యాప్ గురించి కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో సభ్యులకు వివరిస్తూ సందేశ్ యాప్ పని తీరు వివరాలను ఆయన రాతపూర్వకంగా అందజేశారు. సందేశ్ యాప్ గురించి కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సందేశ్ యాప్ చాలా సురక్షితమైన ఓపెన్ బేస్డ్ యాప్ అని అన్నారు.
''క్లౌడ్ ఎనేబుల్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ కంట్రోలింగ్ పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్‌తో పాటు ఫైల్ షేరింగ్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ సౌలభ్యం, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ ఫీచర్లు ఉండేలా సందేశ్ యాప్‌ని రూపొందించారు. ఆండ్రాయిడ్ యాజర్స్, ఐఓఎస్ యూజర్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌తో (Google play store) పాటు యాప్ స్టోర్‌లోనూ సందేశ్ యాప్ అందుబాటులో ఉంటుంది'' అని మంత్రి చంద్రశేఖర్ తెలిపారు.
కేంద్ర సాంకేతిక సమాచార శాఖకు చెందిన ఐటి నిపుణులు సహాయంతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) డెవలప్ చేసిన సందేశ్ యాప్ కూడా వాట్సాప్ ఫీచర్స్‌తో (Whatsapp features) అదే తరహాలో పనిచేస్తుందని కేంద్రం తెలిపింది. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యేలా సందేశ్ యాప్‌ను (Sandesh app features) డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు వాడుతున్న సందేశ్ యాప్ తాజాగా అందరికీ అందుబాటులోకి వచ్చింది.