Barrelakka Love Story: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం రేపిన బర్రెలక్క ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. రాజకీయాలు పక్కనపెడితే ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మొదటి భర్తతో విడిపోయిన కర్నె శిరీష ఈ ఏడాది మార్చి 28వ తేదీన రెండో వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు వెంకటేశ్‌. ఈ సందర్భంగా తన భర్తకు సంబంధించిన ప్రేమకథను ఓ చానల్‌ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన భర్త ఇష్టాయిష్టాలు, తన భర్తకు సంబంధించిన కీలక విషయాలను ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు


'నాకు వెంకటేశ్‌ అంటే మొదట నచ్చేవాడు కాదు. మా ఇద్దరికి ఇంటర్మీడియట్‌ నుంచే పరిచయం ఉంది. నాగర్‌కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో మేమిద్దరం చదువుకున్నాం. తాను మాకు బంధువు అవుతాడని అప్పుడే తెలిసింది' అని బర్రెలక్క తెలిపింది. ఇక తన భర్త ఇష్టాయిష్టాలు చెబుతూ 'చదువుకుంటున్న రోజుల్లో నేను జీన్స్‌ వంటివి వేసుకుని స్టైలీష్‌గా ఉండేదాన్ని. అయితే అది చూసిన వెంకటేశ్‌ అలాంటివి వేసుకోవద్దని తిట్టేవాడు. గాజులు, పూలు, బొట్టు పెట్టుకోవాలని చెప్పేవాడు' చెప్పింది. ఆ సమయంలోనే వెంకటేశ్‌ తనకు నచ్చాడని.. అప్పుడే అతడిపై ఇష్టం కలిగింది అని వివరించింది.

Also Read: Insta Reels Viral: ఎవడ్రా నన్ను ఆపేది.. ట్రాఫిక్‌ ఆపి రోడ్డుపై కుర్చీ వేసుకుని ఇన్‌స్టా రీల్స్‌


ఆ ఇంటర్వ్యూలో బర్రెలక్క మరికొన్ని విషయాలు పంచుకుంటూ.. 'కొన్ని రోజుల తర్వాత ఐ లవ్యూ అని మెసేజ్‌లు పెట్టి డిలీట్‌ చేసేవాడు. అది చూసి అతడిపై ఇంకా కోపం పెరిగింది. ఆ తర్వాత నా జీవితంతో వచ్చిన ప్రతికష్టంలో వెంకటేశ్ నాకు తోడుగా నిలిచాడు. అది కాస్త అతడిపై ప్రేమ కలిగి పెళ్లి దాకా వచ్చింది' అని శిరీష తెలిపింది. ఇక్కడ మరొక ఆసక్తికర అంశాన్ని బర్రెలక్క చెప్పింది. తన భర్తను మొదట్లో 'వెంకటేశ్‌ అన్న' అని పిలిచేదని చెప్పుకొచ్చింది. 'పరిచయమైన కొత్తలో వెంకటేశ్‌ను అన్న అని పిలిచేదాన్ని. ఇప్పుడు పెళ్లికావడంతో అలా పిలవడం లేదు' అని బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష తెలిపింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter