Insta Reels: సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవాలని.. ట్రెండింగ్‌లో ఉండాలనే ఉద్దేశంతో కొందరు పిచ్చిప్రేలాపనలకు దిగుతున్నారు. రీల్స్, వీడియోలు చేస్తూ వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ఓ యువకుడు రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పిస్తూ రీల్స్ చేస్తున్నాడు. అతడిపై పోలీసులు అరెస్ట్ చేసి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
Also Read: Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు
ఢిల్లీలోని షహదారాలోని న్యూ ఉస్మాన్‌పూర్‌కు చెందిన విపిన్ కుమార్ కుమార్ (26)కు సోషల్ మీడియా అంటే ఇష్టం. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఫాలోవర్లను పెంచుకోవడం చేస్తుంటాడు. ఈ క్రమంలో రీల్స్ కోసం రోడ్లపైకి ఎక్కాడు. తన బైక్‌ను తీసుకుని రద్దీ ఉన్న రోడ్లపైకి వెళ్తాడు. అకస్మాత్తుగా వాహనం ఆపి విపిన్ రీల్స్ చేస్తుంటాడు. రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని ఆ వెంట తన బైక్‌ను నిలిపి ఉంచేవాడు. ఇలా తరచూ వీడియోలు చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్టు చేసుకుంటున్నాడు. విపిన్ వీడియోలకు అపూర్వ స్పందన లభిస్తోంది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బందికి కలిగిస్తుండడంతో విపిన్ కుమార్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read: Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్, బిర్యానీ, ఫ్రీ రైడ్
అతడి వీడియోలపై సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు విపిన్ కుమార్‌పై చర్యలు తీసుకున్నారు. విపిన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు అతడి ద్విచక్ర వాహనాన్ని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించి అతడి అకౌంట్‌ను బ్లాక్ చేశారు. మోటార్ వాహన చట్టం ప్రకారం విపిన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ సంఘటనపై పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter