Beautiful Beaches In India: టూరిజం కోసం లేదా సెలవుల్లో సరాదాగా గడపడం కోసం మన దేశంలో కొంతమంది విదేశాల బాట పడుతుంటారు. కానీ వాళ్లకు తెలియని మరో విషయం ఏంటంటే.. విదేశీయులు కూడా వారి సెలవుల్లో టూరిజం కోసం ఇండియాకే వస్తుంటారు అని. ఎందుకంటే ఇండియాలో కూడా అందమైన బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలకు కొదువే లేదు. పైగా విదేశీ పర్యటనలతో పోల్చుకుంటే ఇండియాలో ఉన్న అందమైన బీచ్‌లు చుట్టేసి రావడం అనేది ఇంకా తేలిక అవుతుంది. మరి ఇండియాలో ఉన్న ఆ అందమైన బీచ్‌లు ఏంటో చూసొచ్చేద్దామా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవబాగ్ బీచ్ - మహారాష్ట్ర
ఇండియాలో ఉన్న అందమైన బీచ్ ల జాబితాలో ముందు వరుసలో చెప్పుకోదగినది ఈ దేవబాగ్ బీచ్. ఇది మహారాష్ట్రలోని సిందుదుర్గ్ జిల్లాలోని మల్వన్ పట్టణం సమీపంలో ఉంది. ఇక్కడే మహారాష్ట్రలోని కర్లి నది వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ బీచ్ గురించి ఇంకా చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ బీచ్ పరిసరాలు కూడా చెడిపోకుండా పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.


మిరమర్ బీచ్ - గోవా
గోవా రాజధాని పంజిమ్‌లోనే ఈ మిరమర్ బీచ్ ఉంటుంది. గోవా సంస్కృతి - సంప్రదాయాలు, ఇక్కడి ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, ఫ్యాషన్.. ఇలా ఒక్కటేమిటి.. గోవా లైఫ్ స్టైల్‌ని ప్రతిబింభించే బీచ్ ఇది. 


ఓం బీచ్ - గోకర్ణ -కర్ణాటక
కర్ణాటకలోని గోకర్ణలో అడవులు, కొండల మధ్య నెలవైన ప్రాంతమే ఈ ఓం బీచ్. ఇక్కడికి ఒంటరిగా వచ్చే పర్యాటకులు, ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టొచ్చే భక్తులు, పర్యాటకులు భారీగా వస్తుంటారు. 


ప్యారడైజ్ బీచ్ - పుదుచ్చేరి 
పుదుచ్చేరిలోని చిన్న వీరపట్టణంలో ఈ బీచ్ ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన పరిసరాలు ఉండే ఈ బీచ్‌ని ఇష్టపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి లేదు.


కాపు బీచ్ - కర్ణాటక
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ కాపు బీచ్ ఉంది. ఈ ప్రాంతం పేరు కాపుగా పిలుస్తుంటారు. 1900 కాలంలో నిర్మించిన లైట్ హౌజ్, టిప్పు సుల్తాన్ నిర్మించి కోట, మరియమ్మ చర్చి వంటి నిర్మాణాలు కాపు బీచ్ ని మరింత ప్రత్యేకం చేస్తాయి. ఎక్కువగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. 


మెరినా బీచ్ - చెన్నై
చెన్నైలోని మెరినా బీచ్ గురించి పరిచయమే అక్కర్లేదు. మన మెరీనా బీచ్‌కి ప్రపంచంలోనే ఒక రికార్డు ఉంది. చెన్నై నగరాన్ని ఆనుకుని ఉన్న ఈ బీచ్ ఉత్తరాన ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి దక్షిణాన ఫోర్‌షోర్ ఎస్టేట్ వరకు 6 కిమీ పొడవున విస్తరించి ఉంటుంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ బీచ్ 120 కిమీ పొడవు ఉండగా.. ఆ తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన అర్బన్ బీచ్ మన మెరీనా బీచ్‌గా చెబుతుంటారు.


ఇది కూడా చదవండి : Most Wanted Monkey: జనాన్ని గడగడలాడించి చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ కోతి అరెస్ట్


రాధా నగర్ బీచ్ - పోర్ట్ బ్లెయిర్ 
మన చుట్టూ ఉన్న అందాల గురించి మనకు తెలియదన్నట్టుగానే... అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ వద్ద ఉన్న ఈ రాధా నగర్ బీచ్ కూడా. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అందమైన బీచ్‌ల్లో ఇదీ ఒకటి మాత్రమే కాదు.. ప్రపంచంలోని అన్ని బీచుల్లోనూ అందమైన బీచ్‌ల జాబితాలో 7వ స్థానంలో నిలిచిన బీచ్ ఇది.


ఇది కూడా చదవండి : Couple Romancing On running Bike: కదిలే బైకుపై తిక్కవేషాలు.. తిక్క కుదిర్చిన పోలీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK