Visakhapatnam Beach: ప్రపంచంలోని అరుదైన బ్లూ ఫ్లాగ్ బీచ్ గా రుషికొండ బీచ్

సిటీ ఆఫ్ డెస్టినీగా పిల్చుకునే విశాఖపట్టణం మరో అరుదైన ఘనతను సాధించింది. విశాఖలోని రుషికొండ బీచ్ ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ల సరసన స్థానం సంపాదించింది.

Last Updated : Oct 11, 2020, 08:12 PM IST
Visakhapatnam Beach: ప్రపంచంలోని అరుదైన బ్లూ ఫ్లాగ్ బీచ్ గా రుషికొండ బీచ్

సిటీ ఆఫ్ డెస్టినీ ( City of Destiny ) గా పిల్చుకునే విశాఖపట్టణం మరో అరుదైన ఘనతను సాధించింది. విశాఖలోని రుషికొండ బీచ్ ( Rushikonda Beach ) ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ( Blue Flag Beach ) ల సరసన స్థానం సంపాదించింది.

భారతదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి విశాఖపట్టణం. సుదీర్ఘమైన సముద్రతీరంతో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తున్నారు అందుకే ఈ నగరాన్ని. నగరంలోని ఒక్కో బీచ్ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రుషికొండ బీచ్ సుమనోహరంగా ఉంటుంది. ఓ వైపు కొండ..మరోవైపు లోపలకు చొచ్చుకొస్తున్నట్టుండే సముద్రతీరం. విశాఖపట్టణం ( Visakhapatnam ) వెళ్లినవారు రుషికొండ బీచ్ ను సందర్శించకుండా ఉండలేరు. ఇప్పుడీ అందమైన బీచ్ ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లూ ఫ్లాగ్ బీచ్ ల సరసన స్థానం సంపాదించుకుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్  లభించినందుకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ( Ap Tourism minister Avanti Srinivas ) సంతోషం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

రాష్ట్రంలోని ఇతర బీచ్ లకు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఇండియాలో 8 బీచ్ లకే ఇప్పటి వరకూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. ఇప్పుడు విశాఖ ఋషికొండ బీచ్ తొమ్మిదవ బీచ్ గా నిలవనుంది. ప్రపంచంలోనే 50 బ్లూ ఫ్లాగ్ బీచెస్ లో పొల్యూషన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ లో కూడా విశాఖపట్టణం మూడో స్థానం సాధించింది. ఈమేరకు బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇండియా మిషన్ లీడర్ ప్రకటన విడుదల చేసింది. Also read: AP: స్థానిక ఎన్నికల అంశం, మరోసారి ప్రభుత్వానికి నిమ్మగడ్డకు వివాదమయ్యేనా

Trending News