ప్రస్తుతం భారత్  చైనా మధ్య ( India Vs China)  కొనసాగుతున్నో ఉద్రిక్తల మధ్య  చైనా వస్తువుల ను బహిష్కరించాలని ( Boycott China ) భారతీయులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో చైనాకు సంబంధించిన బ్రాండ్స్  కు ప్రత్యమ్నాయాలు కూడా వెతుకుతున్నారు. భారత ప్రభుత్వం కూడా స్వయం సమ్రుద్ధి సాధించే ( Atma Nirbhar Bharat) దిశగా దేశీయ బ్రాండ్లను ( Indian Brands ) ప్రోత్సాహించాలని నిర్ణయించింది. అయితే భారతీయుల్లో అధిక శాతం చైనా బ్రాండెడ్ మొబైల్స్ వాడుతున్నారు. వాటికి ప్రత్యామ్యాయం కోసం వెతుకుతున్నారు.  అలాంటి కొన్ని దేశీయ స్మార్ట్ ఫోన్స్ ప్రత్యామ్నాయాలు  మీకోసం...



MICROMAX


దేశీయ బ్రాండ్స్ లో Micromax Mobiles అతి పెద్ద బ్రాండ్ గా అవతరించింది. ఈ బ్రాండ్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. పైగా మైక్రోమ్యాక్స్ ఎల్ ఈడీ ( LED ) టీవీలు, ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తుంది.  ఈ సంస్థ 2008 హ్యాండ్ సెట్స్ అమ్మడం ప్రారంభించింది. మైక్సోమ్యాక్స్ Canvas infinity, Infinity N 11  వంటి బ్రాండ్స్ మంచి విజయాన్ని సాధించాయి.



KARBONN


 స్మార్ట్ ఫోన్స్ నుంచి అతి తక్కువ ధరకు లభించే జీఎస్ సిమ్ ఫోన్లకు కార్బన్  మొబౌల్స్ కు మంచి పేరు ఉంది.  వాటితో పాటే ట్యాబ్లెట్స్  ఇతర యాక్సెసరీస్ కూడా తయారు చేస్తుంది.  దీని హెడ్ ఆఫిస్ డిల్లీలో ఉంది. కార్బన్ తన ఉత్పత్తులనున బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకా, పలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంది. 2009 లో ప్రారంభం అయిన ఈ బ్రాండ్ నుంచి Karbonn Titaniam S9 plus,  Karbonn V 1, K 9 Smart Plus వంటి విజయవంతమైన మోడల్స్ వచ్చాయి.



LAVA


2009 లో ప్రారంభం అయిన LAVA INTERNATIONAL జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ గురించి ప్రకటించించిన వెంటనే ఈ సంస్థ తమ ప్రొడక్షన్ హౌజ్ ను త్వరలో చైనా నుంచి  భారతదేశానికి తరలించాలని నిర్ణయించుకుంది. CMR రిటేయిల్ సెంటిమెంట్ ఇండెక్స్ 2018 లో లావా అత్యంత నమ్మదగిన బ్రాండ్ గా ఎంపికైంది. పూర్తి భారీయ 



XOLO


LAVA INTERNATIONAL  కంపెనీ సహాయక కంపెనీలో XOLO కూడా ఒకటి.  ఈ సంస్థ తన కార్యకలాపాలను నోయిడా నుంచి నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్  నుంచి వచ్చిన XOLO X900 ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న ఫోన్. ఈ ప్రాసెసర్ తో లాంచ్ అయిన తొలి మొబైల్ ఇదే కావడం విశేషం. XOLO BLACK తో పాటు XOLO Q మంచి విజయాన్ని సాధించాయి.



YU  


Cyanogen Inc తో పాటు  Micromax Information Limited  సహాయక సంస్థ అయిన YU Televenture హరియాణాలోని గురుగ్రామ్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.  మైక్సో సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైన రాహుల్ శర్మకు   YU లో 99  శాతం వాటా ఉంది.  YU Yureka 2, YU Yunique 2, YU Ace  మోడల్స్ మంచి విజయాన్ని సాధించాయి.అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో