Python Snake in Graveyard: ఒక సమాధిలోంచి మరో సమాధిలోకి 6 అడుగుల కొండచిలువ
Python Snake in Muslim Graveyard: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఒక్కసారి చూస్తే చాలు చాలా రోజులు వెంటాడే అనుభవం.. సమాధిని చూసిన ప్రతీసారి గుర్తొచ్చే ఘటన. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా స్మశాన వాటికలో సమాధుల కింద తిరుగుతున్న పెద్ద కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Python Snake in Muslim Graveyard: కొండచిలువ పాము అంటేనే పాముల్లోనే అతి భయంకరమైన సర్పంగా పేరుంది. కింగ్ కోబ్రా, పైథాన్.. ఈ రెండింట్లో ఏది డేంజర్ అని అడిగితే చెప్పడం కష్టమే. కాకపోతే నాగు పాములు చాలా చోట్ల, చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి అవి మామూలే అనిపిస్తాయి. ఇక కొండచిలువలు చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి అవి ఏ సైజులో ఉన్నా కాస్తంత భయం ఎక్కువే. అందులోనూ లావుగా, పొడవుగా ఉండే కొండ చిలువలకు శక్తి ఇంకా ఎక్కువే ఉంటుంది కాబట్టి దానిని చూసినప్పుడు కలిగే ఆ భయం ఇంకొంత పెరుగుతుంది.
తాజాగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఉన్న ముస్లిం స్మశానవాటికలో ఓ పెద్ద కొండ చిలువ దర్శనం ఇచ్చింది. ఎవ్వరు చూశారో.. ఎలా చూశారో తెలియదు కానీ.. 6 అడుగులు పొడవైన కొండ చిలువ ఒక సమాధి లోంచి మరో సమాధిలోకి వెళ్తుండగా గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో క్లిప్పింగ్‌లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఫలక్ నుమాలోని ఖాద్రి చమాన్ స్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. స్మశానవాటికలో భారీ కొండచిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు, తరచుగా అటువైపు వివిధ పనులపై వచ్చిపోయే వారు హడలెత్తిపోతున్నారు. అంతేకాకుండా ఇదే స్మశానవాటికలో ఒక పెద్ద చింత చెట్టు ఉన్నందున చింతకాయల కోసం తరచుగా పిల్లలు ఇక్కడికి వస్తారని.. అందుకే ఆ కొండచిలువను పట్టుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
(Video Source : Siasat twitter )
వీడియోలో కనిపించిన దృశ్యం ప్రకారం ఆ కొండ చిలువ అక్కడే సమాధుల మధ్య ఆశ్రయం చేసుకుని నివాసం ఉంటున్నట్టు అర్థమవుతోంది. ఈ సీన్ చూసిన తర్వాత స్థానికులకు వస్తున్న మరో సందేహం ఏంటంటే.. సమాధుల కింద ఇలాంటి పాములు ఇంకెని ఉన్నాయో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఆ ఊహే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదూ.. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్న చందంగా ఏ సమాధి కింద ఏ పాము ఉందో ఎవరికి తెలుసు మరి అని స్థానికులు అనుకుంటున్నారు ! ఈ వీడియో చూసినవాళ్లు ఎవరైనా ఇకపై సమాధుల వైపు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో మరి !!
Also Read : Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి