Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Watch Kissing Cobra Goes Wrong: పాములను రక్షించడం వరకు మంచిదే కానీ వాటితో ముద్దు-ముచ్చట్లు పెట్టడం, పెంచుకున్న కుక్క పిల్లను, పిల్లిని ముద్దాడినట్టు ముద్దాడం వంటి పనులు చేయడం మాత్రం ఏరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.

Written by - Pavan | Last Updated : Oct 2, 2022, 07:48 PM IST
Kissing Cobra Goes Wrong: నాగు పాముకు కిస్ ఇస్తుంటే సడెన్‌గా వెనక్కి తిరిగి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Snake catcher bitten by king cobra snake: పాములతో పరాచికాలు ఆడేటప్పుడు ఏ మాత్రం అటు ఇటైనా ప్రాణాలకే ప్రమాదం అని నిరూపించేలా ప్రపంచం నలుమూలలా తరచుగా ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ... స్నేక్ క్యాచర్స్ మాత్రం వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పాములతో ఆడుకున్న వీరుడిగా పది మంది చేత శభాష్ అనిపించుకోవాలనుకుంటారో లేక సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి పాపులర్ అవ్వాలనుకుంటారో తెలియదు కానీ.. అప్పుడప్పుడు పాములతో సయ్యాటలాడుతూ లైఫ్ రిస్క్ తీసుకుంటున్నారు.

తాజాగా కర్ణాటకలోని శివమొగ్గలో ఒకటి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పామును సురక్షితంగా పట్టుకున్న ఓ స్నేక్ క్యాచర్.. అంతటితో ఆ పామును అడవిలో అంతే సురక్షితంగా వదిలేస్తే దాని మానాన అది వెళ్లిపోయేది. కానీ అలా సింపుల్‌గా వదిలేస్తే నేనెలా గొప్పోన్ని అవుతానన్నుకున్నాడో ఏమో కానీ పడగ విప్పిన ఆ నాగు పామును వెనకవైపు నుంచి పట్టుకుని పడగ వెనుకభాగంలో ముద్దు పెట్టాలని ప్రయత్నించాడు. తన పడగ వెనకాల వైపు నుంచి ఏదో రావడం గమనించిన పాము.. తనకు హానీ పొంచి ఉన్నట్టు భావించి క్షణాల్లో మెరుపు వేగంతో ఒక్క పోటు పొడిచింది. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకైన సదరు యువకుడు వెంటనే ఆ పామును నేలకేసి కొట్టి వెనక్కి పడిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ లేదంటే ఇంకో వీడియో చేయడానికి అతడే ఉండే వాడు కాదు.

పాము అతడిపై దాడి చేసి కాటేయడంతో అప్పటి వరకు సినిమా చూసినట్టు చూసిన జనం ఒక్కసారిగా భయంతో కొంత దూరం జరిగారు. వారిలో ఒకరిద్దరు పామును అనుసరించడం వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన జనం అతడి దుస్సాహసంపై మండిపడుతున్నారు. ఇంకొంతమంది వెరైటీగా తమ ఛమత్కారాన్ని చూపించుకుంటూ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అతడు చేసిన తిక్క పనికి పాము అలా కాటేయడంలో తప్పే లేదని కొంతమంది నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేయగా.. మరొక యూజర్ తనదైన స్టైల్లో స్పందిస్తూ.. అందుకే మహిళలు ఎక్కువ కాలం బతుకుతారు అని స్త్రీ, పురుషుల స్వభావంపై సెటైర్ వేశాడు. 

Also Read : Snakes Viral Video: బాబోయ్.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో.. వీడు మామూలోడు కాదు..

Also Read : Monkey Playing With Tiger: పులిని తెలివిగా ఫూల్ చేసి కిందపడేసిన కోతి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News