Biggest Supermoon Of 2022: 2022 సంవత్సరానికి గాను అతిపెద్ద సూపర్ మూన్ ఈరోజు అంటే 13వ తేదీ జూలై రాత్రి కనివిందు చేయనుంది. 2022 సంవత్సరంలో మొత్తం నాలుగు సూపర్ మూన్ లు కనిపిస్తాయి. రెండు ఇప్పటికే కనిపించగా మూడవది ఈరోజు కనిపించబోతోంది. నాసా శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం తదుపరి సూపర్ మూన్ ఆగస్టు 12వ తేదీన కనిపించబోతోంది. సాధారణంగా చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ ఉండగా భూమికి దగ్గరగా ఉన్న సమయంలో ఈ సూపర్ మూన్ కనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఏడాది మొత్తానికి గాని అతిపెద్ద సూపర్ మూన్ ను జూలై 13వ తేదీన చూడబోతున్నారు. ఈ ఖగోళ దృగ్విషయం చంద్రుడిని సాధారణం కంటే పెద్దదిగా మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. జూలై 13 బుధవారం నాడు సూపర్‌మూన్‌ కనిపించనుందని, మరో మూడు రోజుల పాటు సూపర్‌మూన్‌ కనిపిస్తుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ పౌర్ణమిని బక్ సూపర్ మూన్ అని కూడా పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే థండర్ మూన్ అని కూడా పిలుస్తారట.


ఈ వేసవి ప్రారంభంలో తరచుగా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి సూపర్‌మూన్‌కు థండర్ మూన్ అని కూడా పేరు పెట్టారు. నాసా చెబుతున్న దాని ప్రకారం గురువారం అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల 8 నిమిషాలకు ఈ సూపర్ మూన్ కనిపించబోతోంది. ఇలా భూమికి సమీపంలోకి వచ్చిన నిండయిన చందమామను మరో మూడు రోజులు పాటు చూసే అవకాశం ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ జాబిల్లి భారతదేశ వాసులందరినీ కనువిందు చేయబోతోంది. సాధారణంగా ఏడాదిలో మూడు లేదా నాలుగు సార్లు సూపర్ మూన్ లు కనిపిస్తాయి. భూమి చుట్టూ కక్షలో చంద్రుడు తిరగడానికి మొత్తం 27 రోజులు పడుతుంది.  


Also Read: Adire Abhi: కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఓపెన్ అయిన అదిరే అభి.. మొదటి నుంచి అంతే అంటూ!


Also Read: Babu Mohan: విషం పెట్టి చంపాలని చూశారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన బాబూమోహన్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook