Adire Abhi: కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఓపెన్ అయిన అదిరే అభి.. మొదటి నుంచి అంతే అంటూ!

Adire Abhi Responds on Kiraak RP Comments: జబర్దస్త్ మీద కిరాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్ల మీద అదిరే అభి స్పందించారు. ఈ విషయం మీద ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 05:52 PM IST
  • జబర్దస్త్ పై కిరాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు
  • స్పందించిన అదిరే అభి
  • జీ తెలుగుతో ఎక్స్ క్లూజివ్
Adire Abhi: కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఓపెన్ అయిన అదిరే అభి.. మొదటి నుంచి అంతే అంటూ!

Adire Abhi Responds on Kiraak RP Comments: జబర్దస్త్ కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. జబర్దస్త్ యాజమాన్యం మీద మల్లెమాల సంస్థ మీద అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి మీద ఆర్పీ సంచలన ఆరోపణలు గుప్పించారు. అంతేకాక అక్కడ వాళ్లు పెట్టే తిండి కంటే చంచల్గూడా, చర్లపల్లి జైల్లో తిండే బాగుంటుంది అంటూ కూడా సంచలన ఆరోపణలు చేసిన నేపధ్యంలో తరువాత హైపర్ ఆది రాంప్రసాద్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆ కామెంట్స్ సరికాదని కౌంటర్ ఇచ్చారు.

అతను ఇలా ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడో తమకు తెలియదు అంటూ కామెంట్లు చేశారు ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ అదిరే అభిని పలకరించింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ విషయాల మీద స్పందించమని కోరితే ఆయన తనకు ఈ విషయం మీద క్లారిటీ లేదని చెప్పేశారు.. కిరాక్ ఆర్పీ గురించి ఆయన చెబుతూ మొదటి నుంచి కూడా ఆర్పీ  ఏదైనా ముఖం మీద చెప్పేసే స్వభావం కలవాడు, ముందు నుంచి అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని అనరు. సాధారణంగా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకూడదు కానీ ఆర్పీ లోపల ఏమి దాచుకోకుండా మాట్లాడేశాడు.

అది ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం అన్నట్లు జబర్దస్త్ అభి కామెంట్ చేశారు. తాను అయితే ఆరు నెలలకు ముందే షో నుంచి బయటకు వచ్చానని అభి వెల్లడించారు. ఇక సుధీర్ ఎందుకు బయటకు వచ్చారు అనే విషయం మీద స్పందిస్తూ సాధారణంగా అగ్రిమెంట్లు పూర్తయ్యాక ఉండాల్సిన వాళ్ళు ఉండవచ్చు, వెళ్లాలనుకున్న వాళ్లు వెళ్లవచ్చు కాబట్టి కొంత మంది ఉండడానికి ఇష్టపడితే కొంతమంది మరో షో కోసం లేదా మరో ఛానల్ దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తారని అన్నారు.

అందులో భాగంగానే సుధీర్ వెళ్లి ఉండవచ్చు అని పేర్కొన్నారు. ఇక సుధీర్, రష్మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి స్పందిస్తూ ఇది కేవలం ఒక సినిమాలో హీరో హీరోయిన్లు సంబంధం లాంటిదే తప్ప నిజ జీవితంలో ఏమీ లేదు నిజజీవితంలో వారిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చాడు. ఇక తామందరం కూడా వాట్సాప్ గ్రూప్స్ లో టచ్ లోనే ఉంటామని అన్నారు. 

Also Read: 7 Years of Baahubali: బాహుబలి ఈ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Also Read: Hyper aadi- Ram Prasad: ఆర్పీ చెప్పినవన్నీ అబద్దాలే.. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ల డ్యామేజ్ కంట్రోల్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News