Received Potatoes on Meesho: ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఏమొచ్చాయో చూడండి
Received Potatoes on Meesho: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషోలో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఆలుగడ్డలు వచ్చాయంటూ ఓ కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు.
Received Potatoes on Meesho: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మీషోలో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఆలుగడ్డలు వచ్చాయంటూ ఓ కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కావడంతో ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అన్ని పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. దీంతో కస్టమర్స్ సైతం ఇదే చక్కటి అవకాశంగా భావిస్తూ ఆన్‌లైన్‌లో తమ అవసరాలకు అనుగుణంగా నచ్చిన ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలాగేనేమో కాబోలు బీహార్‌లోని నలందకు చెందిన ఈ వ్యక్తి కూడా తాను డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేశానని.. కానీ తనకు వచ్చిన డెలివరి బాక్సులో డ్రోన్ కెమెరాకు బదులుగా ఒక కిలో ఆలుగడ్డలు ఉన్నాయంటూ వాపోయాడు.
డ్రోన్ కెమెరా బాక్సు డెలివరి చేయడానికి వచ్చిన డెలివరి ఏజెంట్ చేతనే బాక్సు ఓపెన్ చేయించి చూడగా.. అందులో డ్రోన్ కెమెరాకు బదులు ఆలుగడ్డలు కనిపించాయి. సీల్డ్ బాక్సులో ఆలుగడ్డలు చూసి షాకైన మీషో కస్టమర్.. ఇదేంటని డెలివరి బాయ్‌ని ప్రశ్నించగా.. ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని బదులిచ్చాడు. తానే కేవలం డెలివరీ చేసే వాడినే కానీ సెల్లర్‌ని కాదని డెలివరి బాయ్ సెలవిచ్చాడు. మీషో డెలివరి బాయ్ డ్రోన్ కెమెరా బాక్సును అన్‌బాక్సింగ్ చేస్తుండగా వీడియో రికార్డు చేసిన కస్టమర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేం.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే సబ్బులు, మామిడి పండ్లు.. ఇలా ఏవేవో సంబంధం లేనివి డెలివరీ అవడం గతంలోనూ మనం ఎన్నో ఘటనలు చూశాం. ఆ ఘటనలన్నీ ఎలాగైతే వైరల్ అయ్యాయో.. తాజాగా డ్రోన్ కెమెరాకు బదులుగా ఆలుగడ్డలు డెలివరి అయ్యాయనే ఘటన కూడా అంతే వైరల్ అవుతోంది. నెటిజెన్స్ చేతికి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో దొరికితే.. ఆ వీడియోతో చెడుగుడు ఆడుకోకుండా ఉంటారా మరి!! ఇది కూడా అలాగే ఉంది. ఈ ఘటనపై మీషో ఏమని స్పందిస్తుందా అనేదే ప్రస్తుతం వేచిచూడాల్సిన అంశం.
Also Read : Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Also Read : Men in Sarees Garba Dance: అక్కడ మగాళ్లు కూడా చీరలు ధరించి, గర్బా డ్యాన్స్ చేయాల్సిందే.. ఎక్కడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి