Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Cobra Snake Found In School Bag: పాములు బూట్లలో చొరబడిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ?

Written by - Pavan | Last Updated : Sep 26, 2022, 08:36 PM IST
  • పాములు బూట్లలో చొరబడిన వీడియోలు అనేకం
  • స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ?
  • అది కూడా విషపూరితమైన నాగు పాము దూరితే ఇంకేమైనా ఉందా ?
  • ఒళ్లు గగుర్పొడిచే రియల్ సీన్ వీడియో ఇదిగో
Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Cobra Snake Found In School Bag: పాములు బూట్లలో చొరబడిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో పాములు దూరడం ఎప్పుడైనా చూశారా ? స్కూల్ బ్యాగులో పాము దూరితే ఆ బ్యాగ్ ఓపెన్ చేసే స్కూల్ పిల్లల పరిస్థితేంటి ? అది కూడా విషపూరితమైన నాగు పాము దూరితే ఇంకేమైనా ఉందా ? ఊహించుకోవడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదా !! మరి ఈ ఘటనను నిజంగానే ఎదుర్కొన్న వారి పరిస్థితి ఇంకెలా ఉంటుంది ? ఈ రియల్ సీన్ గురించి తెలుసుకోవాలంటే ఇదిగో మనం ఈ వీడియో చూడాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. షాజపూర్‌లోని బదోని స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఉమ రజక్ అనే బాలిక స్కూల్ కి వెళ్లిన అనంతరం తన బ్యాగులో ఏదో కదులుతున్నట్టు గమనించింది. బ్యాగులో ఏదో కదులుతుండటంతో ఒక్కసారిగా షాక్ అయిన ఉమ రజక్.. ఓపెన్ చేసి చూద్దామని అనుకున్నప్పటికీ అంత సాహసం చేయలేకపోయింది. అదే విషయాన్ని స్కూల్ టీచర్ కి చెప్పింది.  

బాలిక చెప్పిన విషయం విన్న స్కూల్ టీచర్.. చాలా చాకచక్యంగా వ్యవహరించారు. స్కూల్ బ్యాగుని అక్కడే క్లాస్ రూమ్ లోనే ఓపెన్ చేయకుండా ముందు జాగ్రత్తగా బయటికి దూరంగా తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో స్కూల్ బ్యాగుని జిప్ ఓపెన్ చేసి పెట్టాడు. అయినప్పటికీ అందులోంచి ఏమీ బయటికి రాకపోవడంతో బ్యాగును తిరగేసి పెట్టాడు. అందులోంచి బయటపడిన పుస్తకాలను ధైర్యంగా తీసి పక్కనపెట్టి మరోసారి స్కూల్ బ్యాగును రివర్స్ చేసి పట్టుకున్నాడు. అయినప్పటికీ అందులో ఉన్న పుస్తకాల మాటున చుట్టచుట్టుకుని ఉన్న పాము బయటికి రాలేదు. ఈసారి కొంచెం గట్టిగా దులపడంతో అప్పుడు కనిపించింది ఒళ్లు గగుర్పొడిచే సీన్.. అందులోంచి బుసలు కొడుతున్నట్టుగా పడగ విప్పిన నాగు పాము బయటికొచ్చింది. పడగ విప్పిన నాగు పామును చూసి షాకవడం అక్కడి వారి వంతయ్యింది. పడగ విప్పిన నాగు పాము అదే బండపై నుంచి కిందకు వెళ్లి అక్కడి నుంచి తప్పించుకుంది.

Also Read : Cobra Snake in School Bag: స్కూల్ బ్యాగులో భయంకరమైన నాగు పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Also Read : Plance Collide: ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా ఎప్పుడైనా.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News