Bihar teacher caught making reels while corrections: కొందరు తమకు సొసైటీలో గుర్తింపు రావాలని వెరైటీ పనులు చేస్తున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలని, ఎలాగైన ఫెమస్ కావాలని నానా పాట్లు పడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీడియోలు, రీల్స్ చేస్తు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తు నానా హంగామా చేస్తున్నారు. బస్టాండ్, మెట్రో, ఎయిర్ పోర్టు, రన్నింగ్ రైలు ఇలా యువత తమ పైత్యాలను రీల్స్ రూపంలో చూపిస్తున్నారు.  ఎత్తైన కొండలు, అడవులు, జలపాతాలు వీరి వెరైటీ పనులకు అడ్డాలుగా కూడా ఎంచుకుంటున్నారు. ఇక రీళ్లు చేస్తు ఎందరో యువత తమ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు. ఇక రీల్స్ పిచ్చిలో పడి.. అసలు ఏంచేస్తున్నామో కూడా ఆలోచించలేని స్థితికి యువత చేరిపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొందరు మెట్రోలలో అసభ్యంగా అమ్మాయిలు రోమాన్స్ చేసుకుంటూ వీడియోలు తీసుకున్నారు. రన్నింగ్ బైక్ ల మీద అమ్మాయిలు, అబ్బాయిలు రొమాన్స్ చేస్తు వీడియోలు చేసుకున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ రీల్స్ పిచ్చి వల్ల కొందరు ఓవర్ నైట్ లో తమ కంటూ స్టార్ డమ్ తెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం లేని చిక్కుల్లో పడిపోతున్నారు. పోలీసుల కేసుల్లో కూడా ఇరుక్కుంటున్నారు. అచ్చం ఇలాంటి ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


బీహర్ లోని పాటలీపుత్ర యూనివర్సీటీలో కొందరు టీచర్లు ఎగ్జామ్ పేపర్ లు దిద్దుతున్నారు. సాధారణంగా పిల్లలు తప్పులు చేస్తే టీచర్లు ఉపాధ్యాయులు వారిని సరిదిద్దాలి. అలాంటిది ఇక్కడ మాత్రం సదరు టీచర్లు పాడుపనులు చేస్తు అడ్డంగా బుక్కైపోయారు. ఎగ్జామ్ పేపర్ ల కరెక్షన్ లను టీచర్ లు ఎంతో కాన్సట్రేషన్ తో దిద్దుతుంటారు. ఎందుకుంటే ఒక్కమార్కు తేడా వస్తే కొందరు పాస్ అయితే.. మరికొందరు ఫెయిల్ అయ్యే చాన్స్ లు ఉంటాయి. ప్రతి ఒక్క మార్కు విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకొవచ్చు.


Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


ఒక్క మార్కుతో టాప్ ర్యాంక్ సాధించడం వంటివి ఎన్నో డిపెండ్ అయి ఉన్నాయి.. అలాంటి పేపర్ కరెక్షన్ సమయంలో కొంత మంది టీచర్లు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎగ్జామ్ పేపర్లను కరెక్షన్ చేస్తు రీల్స్ తీసుకున్నారు. ఒకవైపు , పేపర్ లను దిద్దుతూనే, మరోవైపు రీల్స్ కు ఫోజులిచ్చారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో యూనీ వర్సీటీ అధికారులు సీరియస్ అయ్యారు. సదరు లేడీ టీచర్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక వీడియోపై నెటిజన్లు తమ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter