Bihar Hindi and Urdu Teaching at a time: బీహార్‌లో విద్యా వ్యవస్థ ఎంతటి దుస్థితిలో ఉందో తెలిపే వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ స్కూల్లో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఒకే క్లాస్‌రూమ్‌లో ఇద్దరు టీచర్లు ఒకేసారి రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఒకరు హిందీ బోధిస్తుంటే... మరొకరు ఉర్దూ బోధిస్తున్నారు. అది కూడా ఒకే బ్లాక్ బోర్డుపై... సగం బోర్డులో హిందీ, సగం బోర్డులో ఉర్దూ బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్‌లోని కటిహార్‌లో ఉన్న ఆదర్శ్ మిడిల్ స్కూల్లో కొన్నేళ్లుగా ఇదే తరహాలో బోధన జరుగుతోంది. ఇద్దరు టీచర్లు ఒకేసారి ఒకే బ్లాక్ బోర్డుపై రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తుండటంతో పిల్లలకు ఏమీ అర్థం కాక గోల చేస్తున్నారు. అక్కడే కూర్చొన్న ప్రిన్సిపాల్ కర్రతో టేబుల్‌పై కొడుతూ పిల్లలను వారిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు వేర్వేరు సబ్జెక్టులు బోధిస్తే పిల్లల బుర్రకి ఎలా ఎక్కుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోతే మేం మాత్రం ఏం చేయగలం అన్నట్లుగా అక్కడి టీచర్లు వాపోతున్నారు.


ఆ స్కూల్లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న ప్రియాంక దీనిపై మాట్లాడుతూ... 2017లో ఉర్దూ ప్రైమరీ స్కూల్‌ను తమ స్కూల్లో కలిపినట్లు చెప్పారు. తగినన్ని క్లాస్‌రూమ్స్ లేకపోవడంతో.. అప్పటినుంచి ఒకే తరగతి గదిలో ఒకేసారి ఉర్దూ, హిందీ బోధిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాధికారి కామేశ్వర్ గుప్తా మాట్లాడుతూ.. వేర్వేరు తరగతుల విద్యార్థులకు ఒకే తరగతిలో బోధించడం సరికాదన్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల నమోదును బట్టి మరో క్లాస్‌రూమ్‌ను కేటాయిస్తామన్నారు. 


ఇకనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి విద్యా వ్యవస్థపై ఫోకస్ పెట్టాలని... లేనిపక్షంలో దేశంలో మరింత వెనుకబడుతుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శిస్తున్నారు.



 



Also Read: Prakasam accident:  ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..స్పాట్‌లోనే ముగ్గురు సజీవ దహనం..! 


Also Read: Viral News: ఆలయంలో చోరీ.. రాత్రుళ్లు పీడ కలలతో బెంబేలెత్తిన దొంగలు.. దెబ్బకు విగ్రహాలు వెనక్కి..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G