BJP Candidate Kisses Women Photo Viral News in Telugu: ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ప్రచారంలో వినూత్న పద్ధతులను అవలంభిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభ్యర్థి ప్రచారం చేస్తూ ఓ యువతికి ముద్దు పెట్టాడు. అనూహ్య సంఘటనతో యువతి దిగ్భ్రాంతికి గురవగా.. అభ్యర్థి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. కాగా ముద్దు పెట్టిన అభ్యర్థికి మద్దతుగా ఆ యువతి మాట్లాడడం గమనార్హం. దాంట్లో తప్పేమీ లేదని చెప్పడం మరింత ఆసక్తికరం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Condom Samosa: సమోసలో కండోమ్‌లు, రాళ్లు, గుట్కాలు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు


పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ఖగేన్‌ ముర్ము మరోసారి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖగేన్‌ ముమ్మరంగా పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు నానా వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలో తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని శ్రిహిపూర్‌ గ్రామంలో సోమవారం ఖగేన్‌ ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ ఇంటి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో ఓ యువతి కనిపించగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. ఎంపీ అలా చేయడంపై యువతి విస్మయం వ్యక్తం చేస్తోంది. అనూహ్య పరిణామంతో ఖంగుతింది. అయితే ముద్దుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Also Read: Ice Cream Semen: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై 'ఆ పని' కానిచ్చేసి ఐస్‌క్రీమ్‌లో వీర్యం కలిపిన యువకుడు


ఎంపీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శలు చేశాయి. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ ముద్దు వ్యవహారంపై అభ్యర్థి ఖగేన్‌ స్పందించారు. 'యువతిని కుమార్తెలా భావించి ముద్దు పెట్టా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి?' అని నిలదీశారు. కుట్రపూరితంగా దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత యువతి కూడా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా వ్యాఖ్యానించడం గమనార్హం.


ఆయన ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? అని ముద్దు పెట్టించుకున్న యువతి పేర్కొంది. 'ఆయన తన సొంత కుమార్తెలా భావించి ముద్దు పెట్టుకున్నారు. దీనిలో సమస్య ఏంటి? ఇలాంటి ఘటనలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం సరికాదు' అని పేర్కొంది. ముద్దు పెట్టిన ఎంపీ తీరుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన అభ్యర్థిపై ఇతర పార్టీలు ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter