Samosa Condoms: చిరుతిండి తిందామని క్యాంటీన్‌కు వెళ్తే సమోసలో కండోమ్‌లు కనిపించాయి. అంతేకాకుండా గుట్కాలు, రాళ్లు దర్శనమిచ్చాయి. ఒకటి రెండు సమోసాల్లో కాదు అన్ని సమోసాల్లో అవి కనిపించడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. యాక్ థూ అనుకుంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంటీన్ నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగారు. అయితే ఉద్దేశపూర్వకంగానే క్యాంటీన్ వ్యక్తి ఇలా చేశాడని తెలిసీ అందరూ షాకయ్యారు. ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేసి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.
Also Read: Tamanna Simhadri: పవన్ కల్యాణ్‌కు షాక్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తమన్నా
పుణె సమీపంలోని పింపరి చించ్‌వాడ్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగుల కోసం ఒక క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. అయితే గత నెల మార్చి 27వ తేదీన క్యాంటీన్‌లో ఉద్యోగులు తినడానికి వెళ్లగా.. సమోసలో కండోమ్‌లు, గుట్కాలు, రాళ్లు కనిపించాయి. ఈ విషయాన్ని ఉద్యోగులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులు ఆరా తీయగా క్యాంటీన్ నిర్వాహకుడు చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయారు.
Also Read: Medigadda Sinks: మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ.. ప్రమాదకరంగా కాళేశ్వరం ప్రాజెక్టు
తన క్యాంటీన్ క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను తొలగించారు. క్యాంటీన్ కాంట్రాక్ట్ కొనసాగించాలని కోరినా కూడా కంపెనీ పట్టించుకోలేదు. కాంట్రాక్ట్ కొత్త వారికి ఇచ్చారు. అయితే కంపెనీకి బుద్ధి చెప్పాలని పాత క్యాంటీన్ వ్యక్తి కొత్త క్యాటరింగ్ సంస్థలో తన మనుషులను పనికి పెట్టాడు. కంపెనీకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సమోసలో ఆ వస్తువులు కలిపాడు. కంపెనీ అధికారులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సమోసలో ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తేలింది.
ఉద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సమోసలో అవి కలిపిన మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో కొత్త క్యాంటీన్‌లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు ఉండడం గమనార్హం. ఆ కార్మికులతో పాత క్యాంటీన్ వ్యక్తి ఇలా చేయించాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాంటీన్ నిర్వాహకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కోపం ఉంటే మాత్రం తినే పదార్థాలు అలాంటి వస్తువులు కలుపుతారా? అని ప్రశ్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook