Black King Cobra protecting Real Nagamani Stone: హిందూ పురాణాలలో నాగుపాము లేదా త్రాచుపాముకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ పరమ శివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. అందుకే శివుడిని పూజించే ప్రతి ఒక్కరు నాగుపాము కూడా పూజిస్తుంటారు. శివరాత్రి రోజున శివుడితో పాటు నాగుపామును కూడా ప్రజలు పూజిస్తారు. ముఖ్యంగా నాగులచవితి నాడు హిందువులు నాగుపామును ప్రత్యేకంగా పూజిస్తారు. పుట్టలో పాలు పోసి మరీ భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. ఆ రోజున ఉపవాసాలు కూడా ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరమ శివుడికి నాగుపాము లేదా త్రాచుపాము ముఖ్య అనుచరులుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి గుడిలో నాగుపాము కచ్చితంగా ఉంటుందని అందరూ అంటుంటారు. కొన్ని గుడులలో శివ లింగానికి లేదా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని మనం చాలా సీరియల్స్, సినిమాల్లో చూసాం కూడా. ఇటీవల వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా నాగుపాముకు సంబందించిన కథే. 



తెరపైనే కాదు రియల్‌గా కూడా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్ల త్రాచుపాము ఒకటి నాగమణికి కాపలాగా ఉంది. రాత్రి సమయంలో కూడా ఆ పాము కాపలా కాస్తోంది. పడగ విప్పి మరీ అటూఇటూ చూస్తోంది. దాంతో నాగమణిని తాకేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ వీడియో చుసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నాగమణిని కాపాడుతున్న నాగుపాము అంటూ కెమెంట్స్ చేస్తున్నారు. 


Also Read: నాగుపాము తల నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!


Also Read: Amazon Best Offers: అమెజాన్‌లో అద్భుత ఆఫర్.. రూ. 3 వేలకే iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.