Five people Carrying 22 Feet King Cobra: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం 'కింగ్ కోబ్రా'. అంతేకాదు అన్ని పాములలో కెల్లా చాలా పొడవైన పాములలో ఒకటి కింగ్ కోబ్రా. అయితే 10 నుంచి 16 అడుగుల వరకు ఉన్న కింగ్‌ కోబ్రాలను ఇప్పటివరకు మనం చూశాం. 20 అడుగులకు పైగా పొడవు, పెద్ద పరిమాణంతో ఉన్న కింగ్‌ కోబ్రాను దాదాపుగా ఇప్పటివరకూ ఎవరూ చూసుండరు.  20 అడుగులకు పైగా పొడవు ఉన్న ఓ భారీ కింగ్‌ కోబ్రా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థాయిలాండ్‌కు చెందిన ఓ స్నేక్ క్యాచర్‌ భారీ కింగ్ కోబ్రాను చాలా సునాయాసంగా పట్టాడు. కొండ ప్రాంతంలో భారీ సైజ్ కింగ్‌ కోబ్రా ఉందని సమాచారం అందగానే.. స్నేక్ క్యాచర్‌ తన టీంతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. కొండ పైన ఉన్న ఓ రాయి సందులో పాము ఉన్నట్టు గుర్తించారు. స్టిక్ సాయంతో దాన్ని బయటకు లాగగా అది దాదాపుగా 20 అడుగులకు పైగా ఉంది. ఏమాత్రం భయపడని ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు దాన్ని పూర్తిగా బయటికి తీసి.. తలను పట్టుకున్నారు. దాంతో అది వారి చేతిలో బందీగా మారింది. 



20 అడుగులకు పైగా ఉన్న కింగ్‌ కోబ్రాను ఏకంగా ఐదుగురు స్నేక్ క్యాచర్‌లు కలిసి కొండ పైనుంచి కిందకు పట్టుకొచ్చారు. ఆపై ఓ స్నేక్ క్యాచర్‌ దాని వివరాలను తెలుపుతాడు. ఆపై ఆ పామును సంచిలో బందించి అడవుల్లో వదిలేస్తారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్లో ఉంది. నిజానికి ఈ వీడియో 4 నెలల క్రితం పోస్ట్ చేసినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 426,288 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంతపెద్ద కింగ్ కోబ్రానా అని కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: 16 అడుగుల కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని విన్యాసాలు చేసిన వ్యక్తి.. మెంటలెక్కించే వీడియో!


Also Read: Naga Chaitanya Custody Teaser: నన్ను చావు వెంటాడుతోంది.. ఆసక్తికరంగా నాగచైతన్య 'కస్టడీ' టీజర్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి