Blindfolded Rajput women display sword skills at Talwar Raas a video is going viral: గుజ‌రాత్‌లో త‌ల్వార్ రాస్ ఉత్స‌వాలు క‌న్నుల పండుగ‌లా సాగుతున్నాయి. ఐదురోజుల‌పాటు సాగే ఉత్సవాలలో రాజ్‌పుత్ మ‌హిళల (Rajput women) సాహసాలు అబ్బురపరుస్తున్నాయి. రాజ్‌కోట్‌కు చెందిన రాజ‌కుంటుంబం (Royal Family of Rajkot) గ‌త 12 ఏళ్లుగా ప్ర‌తి ఏటా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. ఈ ఉత్స‌వాల్లో వందలాది రాజ్‌పుత్ మ‌హిళలు పాల్గొంటున్నారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఈ ఉత్స‌వాల్లో పాల్గొన్న మ‌హిళ‌లు చేసే సాహసాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. క‌త్తుల‌ను చేతబూని నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు రాజ్‌పుత్ మ‌హిళలు. క‌త్తుల‌తో ర‌క‌ర‌కాల విన్యాసాలు (sword skills) చేసి అదరగొడుతున్నారు. ఏకంగా కళ్లకు గంతలు (Blindfolded) కట్టుకుని కత్తులతో విన్యాసాలు చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇక త‌ల్వార్ రాస్ (Talwar Raas) ఉత్స‌వాల‌ గురించి రాజ్‌కోట్‌కు చెందిన రాజకుటుంబీకులు, రాకుమారి కాదంబ‌రి దేవి కొన్ని విషయాలు చెప్పారు. గ‌త 12 ఏళ్లుగా (12 years) త‌ల్వార్ రాస్ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌తి ఏడాది కొత్త బృందం ఈ ఉత్స‌వాల్లో క‌త్తి విద్య‌ల‌ను ప‌ద‌ర్శిస్తున్నట్లు చెప్పారు. మ‌హిళ‌లు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. 


Also Read : Pawan Kalyan-Rana Pic: ఒకరు భీమ్లా నాయక్.. మరొకరు డేనియల్ శేఖర్.. తగ్గేదేలే!


తమకు క‌త్తి.. దేవ‌త‌తో స‌మాన‌మ‌ని, అందుకే తాము ప్ర‌తి ఏడాది శ‌స్త్ర పూజ (Shastra Puja) చేస్తామ‌ని తెలిపారు. రాజ‌వంశానికి చెందిన ఎంద‌రో వీర‌నారుల చ‌రిత్ర‌ను చాటిచెప్ప‌డానికి ఈ ఉత్స‌వాల‌ను తోడ్ప‌డుతున్నాయ‌న్నారు. మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించేందుకు ఈ తల్వార్‌ రాస్‌ (Talwar Raas) నిదర్శమన్నారు. ఇక గతంలో ఏకంగా 2 వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు (Rajput women) ఖడ్గాలతో నృత్యం చేసి గిన్నిస్‌ రికార్డు కూడా సృష్టించారు. 


Also Read : IAF trainer aircraft crashes : కుప్పకూలిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి