Hyderabad: ఎంత టెక్నా లజీ పెరిగినా, ఎన్ని సౌకర్యా లు అందుబాటులోకి వచ్చి న మహిళలు దేని లోనూ పురుషుల కంటే తక్కువ కాదని ఊకదంపుడు ఉపన్యా సాలు ఎన్ని ఇచ్చి న వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు, ఇలాంటి సంఘటనలు కేవలం చదువుకొని మహిళలకు లేదా మారుమూల ప్రాంతాలలో జరుగుతున్నాయని అనుకుంటే మనం పొరపాటు చేసినట్లే, సాఫ్ట్ వేర్ కొలువులు చేస్తూ 5 అంకెల జీతం సంపాదిస్తున్న మహిళలు కూడా ఇలాంటి సందర్భా లను తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక విషయంలోకి వస్తే మహిళలు, చిన్నారుల పైవేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్ పోలీస్ విభాగం (Cyberabad Police) వాట్సాప్ (Whats App)విధానంలో తమకు తెలియజేయడం కోసం ఒక సేవను ప్రారంభించింది, ఇందులో భాగంగా ఒక మహిళ పంపిన స్క్రీన్ షాట్ సైబరాబాద్ మహిళ చిన్నా రుల రక్షణ వింగ్ (Women & Children Safety Wing Cyberabad) తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూస్తే ఈ కంప్యూ టర్ యుగంలో కూడా మహిళలను కీచకులు ఎలా వేదిస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.


Also Read: Gas Price Hike: మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు, సిలెండర్‌కు 25 రూపాయలు పెంపు


ఆ పోస్ట్ లో ఒక కీచక బాస్ (Softwear Boss) తన కింద పని చేసే ఉద్యోగినిని ఎలా లొంగదీసుకోవాలనుకున్నాడో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో అమ్మా యి పనితీరు ఏ మాత్రం బాగోలేదని చెప్పా డు, దాంతో ఆమె "నేను బాగానే పని చేస్తున్నాను" అంతేకాకుండా సహోద్యోగి సెలవులో ఉన్న కూడా తానే కష్టపడి ప్రాజెక్ట్ పూర్తి చేశానని అని సమాధానం ఇచ్చింది.


అయితే అదంతా అనధికార పని అని బాస్ వాదించాడు, దాంతో ఆమె చాలా భయపడిపోయి, ఆ పనే తన జీవితం అని వాపోయింది, దాంతో రూట్ మార్చిన బాస్, భయపడకు నీ జీతం, ప్రమోషన్ అన్ని నేను చూసుకుంటానని చెప్పి చివర్లో తన వక్రబుద్దిని బయటపెట్టాడు. కీచక బాస్ ఆ మహిళ ఉద్యోగిని “ఓయో” (OYO) రూమ్ కి ఆహ్వా నించాడు, దాంతో బాస్ దుర్బుద్ధిని కనిపెట్టిన ఆ మహిళ “నేను అలాంటి దానిని కాదని చెప్పింది”. అలా చెప్పిన కూడా ఆ నీచుడు వినిపించుకోకుండా నేను కూడా అలాంటి వాడిని కాదు, కానీ నువ్వు ఆఫీస్ లో చేరిన మొదటి రోజు నుండి నీ పై నాకు క్రష్ ఉందని నీచంగా మాట్లాడాడు. దానికి ఆమె నేను అలా చేయను అని ఖరాఖండిగా చెప్పేసింది, దాంతో అతను నా మాట వినకపోతే నీ జీతం, ప్రమోషన్ ఇరకాటంలో పడతాయని బెదిరించాడు.



Also Read: Telangana Schools Reopen: కరోనా ఆంక్షల మధ్య తెలంగాణలో మోగిన బడి గంటలు... ఫోటోస్


ఈ సంఘటనను చూస్తుంటే మహిళలకు మన దేశంలో భదత్ర ఉందా? అనే అనుమానాలు రాకా మానవు, ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాగే చాలా మంది మహిళలు తాము పని చేసే పద్రేశాలలో లైంగిక, మానసిక భాదను అనుభవిస్తున్నారు, కానీ ఆ విషయాలను బయటకు చెబితే వాళ్ల భవిష్యత్తు ఇరకాటంలో పడుతుందని లేదా వారిని సమాజంలో చులకనగా చూస్తారని భయపడి పోలీసులకు లేదా తమ ఆప్తులకు చెప్పు కోకుండా వారిలో వారే మానసిక క్షోభకు గురవుతున్నారు. 


సైబరాబాద్ పోలీస్ విభాగం ద్వారా ప్రారంభించిన ఈ సేవను ఉపయోగించుకుంటూ ఇలాగే ఉద్యోగాలు చేసే మహిళలు దైర్యంగా ముందుకు వచ్చి తమపై జరుగుతున్న హింసను బయటపెట్టాలని తెలిపారు. ఇలాంటి విషయాలు బయటకి తెలియకుండా, మీ వివరాలు జాప్యంగా ఉంచుతామని పోలీసుశాఖ వారు ధీమా వ్యక్తం చేశారు. కావున మహిళలు దైర్యంగా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుడా, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు కోరారు. 


Also Read: AP HRC Office: మూడు రాజధానుల దిశగా ఏపీ ప్రభుత్వం, కర్నూలులో తొలి కార్యాలయం ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook