Viral Video: రన్నింగ్ ట్రైన్ లో షాకింగ్ ఘటన.. చూస్తే భయంతో వణికిపోతారు..వీడియో వైరల్..
Chain Snatching: ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు ట్రైన్ లోని ఎగ్జిట్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు మహిళలు వాష్ రూమ్ కు వెళ్తామని వచ్చారు. అప్పుడు కలలకూడా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Boy Chain Snatching In Running Train: కొందరు కేటుగాళ్లు ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం చోరీలు చేస్తుంటారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు రద్దీగా ప్రదేశాలలో వేచీ చూస్తుంటారు. అదే విధంగా పెద్దవాళ్లు, మహిళలను కూడా టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. పెళ్లిళ్ల కోసం మహిళలు కాస్లీ జువెల్లరీ వేసుకుని కొందరు బస్సులలో, ట్రైన్లలో జర్నీలు చేస్తుంటారు. కిటీకిల దగ్గర కూర్చుని ఉంటారు. కొందరు వీరిని అబ్జర్వ్ చేస్తుంటారు. ట్రైన్ లేదా బస్సులు కదిలేటప్పుడు వెంటనే అమాంతందాడిచేసి బంగారంచైన్ లు, మంగళసూత్రాలను ఇట్టే తెంపెసుకుని సెకన్లలో మాయమైపోతుంటారు.ఇప్పటికే ట్రైన్ లలో తరచుగా చోరీలు జరుగుతుంటాయి.
రాత్రిపూట మరీ ముఖ్యంగా పడుకుని ఉన్న ప్యాసింజర్ ల మెడలో నుంచి చైన్ లు, మంగళసూత్రాలను లాక్కుంటారు. కొందరు అర్ధరాత్రిళ్లు ట్రైన్ లో ఎక్కి, ప్యాసింజర్ లను గన్ లు, కత్తులతో బెదిరింపులకు గురిచేసి అందినకాడికి దోచుకుని పోతుంటారు. ఇక.. రన్నింగ్ ట్రైన్ లలో ఈ మధ్య కాలంలో చోరీల ఘటన ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రైన్ స్లోగా వెళ్తున్నప్పుడు.. డోర్ల వద్దనున్న ప్యాసింజర్ లు, మహిళల బంగారం, ఫోన్ లే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఒక యువకుడు పక్కా ప్లాన్ ప్రకారం ట్రైన్ లో ఎగ్జిట్ డోర్ వద్ద నిలబడి ఉన్నాడు. ట్రైన్ ప్లాట్ కాస్త నెమ్మదిగా వెళ్తుంది. ఇంతలో ఇద్దరు మహిళలు వాష్ రూమ్ కు వెళ్దామని రైలు నుంచి బాత్రూమ్ కు వెళ్తున్నారు. ఈ యువకుడిని వారు గమనించలేదు. ఇంతలో అతగాడు.. ఆమాంతం మహిళ మెడమీద చెయ్యివేసి, సెకన్ల వ్యవధిలో మంగళసూత్రం చేతిలో పట్టుకుని రైలు నుంచి కిందకు దూకేశాడు. సదరు మహిళ యువకుడితో కాస్తంత ప్రతిఘటించిన కూడా లాభంలేకుండా పోయింది. ఈక్రమంలో మహిళ కింద పడిపొయింది. వెంటనే రైలులోకి మిగత ప్యాసింజర్ లు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే ట్రైన్ ముందకు, చోరీ చేసిన వాడు వెనక్కు పారిపోయారు.
Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..
ఈ వీడియో మాత్రం అక్కడ ట్రైన్ లోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇదిసామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. అంటూ భయంతో ఇలా కూడా ఉంటారా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇలాంటి వారిని వెంటనే పట్టుకుని పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook