Boy dance in Girl Dress on the streets of the US: అగ్రరాజ్యం అమెరికా వీధుల్లో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే యువకుడి అద్భుత డాన్స్ కంటే ఎక్కువగా.. నెటిజన్లను మరో విషయం ఆకర్షిస్తోంది. అది ఏంటంటే.. ఆ యువకుడు అచ్చు అమ్మాయిలాగా స్కర్ట్ మరియు స్నీకర్స్ ధరించి గార్బా చేయడం. ఈ యువకుడు ఓ కొరియోగ్రాఫర్. అంతేకాదు ఇతగాడు భారత్‌కు చెందిన కొరియోగ్రాఫర్ కావడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌కు చెందిన యువ కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతే.  జైనిల్ తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని.. ఆమెరికా వీధుల్లో డ్యాన్స్‌లు చేస్తుంటాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా వేస్తాడు. ప్రస్తుతం వాటిని అమెరికాలోని వీధుల్లో ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, వీడియోలు చేస్తున్నాడు. తాజాగా జైనిల్.. 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రంలోని ధోలీ తారో అనే పాటకు గార్బా  చేశాడు. మెట్లు ఎక్కుతూ, దిగుతూ చాలా బాగా స్టెప్పులు వేశాడు. 



ఈ పాత కోసం జైనిల్ మెహతే పొడవాటి స్కర్ట్ వేసుకున్నాడు. అలానే చంకీ వైట్ స్నీకర్‌లను కూడా ధరించాడు. ఈ వీడియో ఆగస్ట్ 11న జైనిల్ హన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయాడు. ఇప్పటివరకు ఈ వీడియో ఒక మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఈ వీడియోనే మాత్రమే కాదు.. జైనిల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని అనేక వీడియోలలో స్కర్ట్ ధరించి డ్యాన్స్ చేశాడు. ఇదివరకు స్కర్ట్ ధరించి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్‌కు డాన్స్ చేశాడు. అంతకుముందు ఆలియా భట్‌ కథనాయకిగా నటించిన 'గంగూభాయ్ కతియావాడి' సినిమాలోని ఝూమ్ రే గోరీ సాంగ్‌కి జైనిల్ అదిరే స్టెప్స్‌ వేశాడు. 


Also Read: ఆ పాక్ పేసర్ ఐపీఎల్‌ వేలంలోకి వస్తే 15 కోట్లు పక్కా.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: 'కింగ్ కోబ్రా'కే బాస్.. పడగవిప్పిన పాము తలపై ఒక్కటిచ్చాడుగా! ఆ తర్వాత ఏం జరిగిందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook