Bride Boyfriend came to wedding venue filling sindoor: వధువు ఇష్టంతో పెళ్లి జరిగితే.. ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఉండదు. అదే వధువుకు ఇష్టం లేకుండా వివాహం జరుగుతున్నపుడు.. ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుతుంది. పెళ్లి కూతురు ఆత్మహత్యా యత్నం చేయడం లేదా నచ్చిన వాడితో లేచిపోవడమో జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు నిత్యం చాలానే జరుగుతుంటాయి. తాజగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమికుడు పెళ్లి వేదికపైకి వచ్చి మరీ వధువుకు సిందూరం దిద్ది లేపుకుపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పెళ్లి వేడుక జరుగుతుంటుంది. వధూవరులు వేదికపై కూర్చుని ఉంటారు. వరుడి వయస్సు వధువు వయస్సు చాలా ఎక్కువగా ఉంది. పెళ్లి ఇష్టం లేని వధువు తల వంచుకుని కూర్చుంటుంది. వరుడు తన పక్కన నిలబడి ఉన్న ఓ  మహిళలతో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. ఇదే మంచి సమయం అనుకున్న వధువు ప్రియుడు.. వెనకాల నుంచి వెళ్లి వేదిక పైకి వస్తాడు. ఇది గమనించని వరుడు తన పనిలో బిజీగా ఉంటాడు.



వధువు ప్రియుడు కుర్చీ వెనుక నిలబడి.. ఆమె నుదిట ఐదుసార్లు సిందూరం దిద్దుతాడు. అనంతరం ఆ వ్యక్తి వధువు చేయి పట్టుకుని వేదికపై నుంచి లేపుకుపోతాడు. దాంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో shitty.humours పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన యూజర్లు బిత్తరపోతున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 


(గమనిక- జీ న్యూస్ ఈ వీడియోలోని వాస్తవికతను ధృవీకరించలేదు. ఇది ఫన్నీ వీడియో కూడా కావచ్చు.)


Also Read: India Asia Cup Final: మెరిసిన షఫాలీ, దీప్తి.. ఆసియా కప్‌ 2022 ఫైనల్‌ చేరిన భారత్‌!


Also Read: భారత్ బౌలింగ్‌లో పస లేకపోయేది.. బాటర్లు హెల్మెట్ లేకుండా ఆడేవారు: సల్మాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook