India Women Asia Cup Final: మెరిసిన షఫాలీ, దీప్తి.. ఆసియా కప్‌ 2022 ఫైనల్‌ చేరిన భారత్‌!

India Women enters Womens Asia Cup T20 2022 Final. మహిళల ఆసియా కప్‌ 2022 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో థాయ్‌లాండ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 13, 2022, 12:06 PM IST
  • మెరిసిన షఫాలీ, దీప్తి
  • ఆసియా కప్‌ 2022 ఫైనల్‌ చేరిన భారత్‌
  • 74 పరుగులు మాత్రమే చేసిన థాయ్‌లాండ్‌
India Women Asia Cup Final: మెరిసిన షఫాలీ, దీప్తి.. ఆసియా కప్‌ 2022 ఫైనల్‌ చేరిన భారత్‌!

India Women enters Womens Asia Cup T20 2022 Final: మహిళల ఆసియా కప్‌ 2022 టోర్నీలో భారత మహిళల జోరు కొనసాగుతోంది. లీగ్‌ దశలో వరుస విజయాలు సాధించిన హర్మన్‌ సేన.. తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్య చేధనలో థాయ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది. భారత్ విజయంలో బ్యాటర్ షెఫాలీ వర్మ (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్), బౌలర్ దీప్తి శర్మ (7/3) కీలక పాత్ర పోషించారు. 

149 పరుగుల లక్ష్య ఛేదనలో థాయ్‌లాండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లను దీప్తి శర్మ బోల్తా కొట్టించింది. నన్నపట్ కొంచారోయింకై (5), నత్తకాన్ చంతమ్ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. కొద్ధిసేపటికే సోర్నరిన్ టిప్పోచ్ (5)ను దీప్తి పెవిలియన్ చేర్చగా..  చనిద సుత్తిరువాంగ్ (1) రేణుక సింగ్ ఔట్ చేసింది. దాంతో 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి థాయ్‌లాండ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో కెప్టెన్ నరూమోల్‌ చైవై (21; 41 బంతులు), నట్టాయ బూచతమ్‌ (21; 29 బంతుల్లో 1 ఫోర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. ఆపై భారత బౌలర్ల ధాటికి థాయ్‌లాండ్‌ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. చివరకు థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ఈ విజయంతో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రాజేశ్వరీ గైక్వాడ్‌ 2, రేణుకా సింగ్‌ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 

అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13; 14 బంతుల్లో 3 ఫోర్లు) విఫలమయినా.. యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్) చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫామ్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (27, 26 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించింది. ఇక ఇన్నింగ్స్ చివరలో పూజా వస్త్రాకర్ (17) విలువైన రన్స్ చేసింది. థాయ్‌లాండ్‌ జట్టులో సొర్నరిన్‌ టిప్పొచ్‌ 3 వికెట్లు పడగొట్టింది. 

Also Read: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..

Also Read: Ashu Reddy Bikini Photos: అషు రెడ్డి బికినీ ట్రీట్.. స్విమ్మింగ్ పూల్లో రచ్చ రేపిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News