Bride Viral Video: వరుడి ముందే.. ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రియుడు! చివరికి..
Bride Lover Married Her In Front Of Groom. వరుడి ముందే తన ప్రియురాలిని ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని చోటుచేసుకుంది.
Lover of Bride married her in front of Groom: కొన్ని కొన్ని ఊహించని ఘటనలు మనం నిత్యం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఘటనలు జరుగుతాయని అస్సలు అనుకోము. కానీ మనం ఊహించని విధంగా ఒక్కోసారి రియల్ లైఫ్‌లోనూ అలాంటి సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వరుడి ముందే తన ప్రియురాలిని ప్రియుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల పాట్నాలోని షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరాయ్ గ్రామంకు చెందిన ఓ అమ్మాయికి, నవాడా జిల్లాలోని జవహర్ నగర్‌కు చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చమయింది. రాత్రి ఊరేగింపుతో పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నాడు వరుడు. జయమాల రాత్రి 11 గంటలకు జరుగుతోంది. వేదికపై వరుడు, వధువు ఉండగా.. బందులు అందరూ పెళ్లి చూసేందుకు వచ్చారు. ఇక్కడే ట్విస్ట్ జరిగింది. ప్రియురాలి పిలుపు మేరకు ఖగారియా నివాసి అయిన వధువు ప్రేమికుడు వివాహానికి వచ్చాడు.
వేదికపై ఉన్న ఓ మహిళ దండలు తీస్తుండగా.. వధువు ప్రియుడు ఒక్కసారిగా వేదికపైకి వచ్చాడు. మహిళ చేతులోంచి దండ తీసుకున్న ప్రియుడు తన ప్రియురాలి మెడలో వేశాడు. ఆపై సిందూరం కూడా దిద్దాడు. ఈ ఘటన అందరూ అవాక్కయ్యేలా చేసింది. పెళ్లి కొడుకు అయితే బిత్తరపోయాడు. వేదికపై నిలబడిన ఒక మహిళ ఎంత పని చేశావురా అంటూ చెంపదెబ్బలు కొట్టింది. ఇంత జరిగినా వధువు ఏమీ మాట్లాడకుండా కిందకి చూస్తూ ఉంది.
ఈ ఘటన అనంతరం వరుడు ఆ ప్రేమికుడిని తీవ్రంగా కొట్టాడు. ప్రేమికుడిని కొట్టకుండా కాపాడేందుకు వధువు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వరుడు ఊరుకోలేదు. స్థానిక గ్రామస్తులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన వరుడి కుటుంబం పెళ్లి వద్దని వెళ్లిపోయారు. అయితే వధువు తరపు వారు యువకుడిపై అలంటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అతడిని వదిలేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read: India vs Zimbabwe: వచ్చే నెల జింబాబ్వేకు టీమిండియా..కెప్టెన్, కోచ్ ఎవరో తెలుసా..?
Also Read: ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ కొనే వారికి గుడ్‌న్యూస్.. పండుగ సీజన్ కంటే ముందే ధరలు తగ్గబోతున్నాయి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook